Ram Charan : ఒక్క మాట అడగ్గానే రామ్ చరణ్ రూ.40 లక్షలు ఇచ్చారు.. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కామెంట్స్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలకు ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. చిరు నట వారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఈరోజు (మార్చి 27) చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు, దర్శక నిర్మాతలు విషెస్ తెలుపుతున్నారు.

Ram Charan : ఒక్క మాట అడగ్గానే రామ్ చరణ్ రూ.40 లక్షలు ఇచ్చారు.. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కామెంట్స్..
Jani Master, Ram Charan

Updated on: Mar 27, 2026 | 4:55 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు నేడు (మార్చి 27). ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, దర్శకనిర్మాతలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు. మరోవైపు చరణ్ బర్త్ డే కానుకగా పెద్ది చిత్రం నుంచి స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. అందులో చరణ్ లుక్స్, విజువల్స్ సినిమాపై మరింత అంచనాలు పెంచేశాయి. అలాగే నెట్టింట చరణ్ కు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ పంచుకుంటూ తమ అభిమానాన్ని తెలియజేస్తున్నారు ఫ్యాన్స్. అలాగే బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా నిర్వహించిన ఓ వేడుకలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చరణ్ గొప్ప మనసును కొనియాడాడు. డ్యాన్సర్స్ సంక్షేమం కోసం చరణ్ ఎంతో సాయం చేశారని.. అలాంటి వ్యక్తి ఇండస్ట్రీకి దొరకడం అదృష్టమని అన్నారు. డ్యాన్సర్స్ హెల్త్ ఇన్సురెన్స్ కోసం రూ.40 లక్షలు ఆర్థిక సాయం చేశారనే విషయాన్ని జానీ మాస్టర్ వెల్లడించారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: సైకో భర్తతో కన్నీళ్ల కాపురం.. భార్యతో బలవంతపు శృంగారం.. ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సినిమా..

“చరణ్ అన్న మన తెలుగు ఇండస్ట్రీకి దొరకడం అదృష్టం. ఆయనను నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఆయన దొరకడం అదృష్టం. లాస్ట్ టైం ఇదే స్టేజ్ పై మన డ్యాన్సర్ కు చరణ్ సార్ హెల్త్ ఇన్సూరెన్స్ చేపిస్తానని చెప్పారని చెప్పాను. డ్యాన్సర్స్ ఎంత కష్టపడుతున్నారో అన్నకు తెలుసు. అందుకే వాళ్లకు హెల్త్ ఇన్సూరెన్స్ చేయిస్తానని మాటిచ్చారు. అందుకోసం మా డ్యాన్సర్స్ యూనియన్ కు రూ.40 లక్షలు పంపించారు. ఇది నలభై లక్షల డబ్బు మాత్రమే కాదు.. ఐదారు వందల కుటుంబాల ఆరోగ్యం. జస్ట్ ఒక్క మాట అడగ్గానే అంతమందికి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించారు” అంటూ చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Aadi Movie: ఆది సినిమాలో ఎన్టీఆర్ జోడిగా ఆ హీరోయిన్ చేయాల్సింది.. తనని వెళ్లి అడిగితే ఏం జరిగిందంటే.. డైరెక్టర్ వివి వినాయక్..

“అడగ్గానే రూ.40 లక్షలు ఇచ్చారు. ఇంకా తక్కువ పడితే చెప్పండి ఇస్తా అన్నారు. డ్యాన్సర్లకు ఎప్పటికీ తోడు ఉంటానని మాటిచ్చారు. నా వెనక వాళ్లు చాలా కష్టపడతారు. నేను ఒక్కసారి డ్యాన్స్ చేస్తే.. వాళ్లు 100 సార్లు డ్యాన్స్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారు. ప్రతి ఒక్క హీరోకు వారంతా ఎంతో మద్దతుగా ఉంటారు అని చరణ్ అన్న అన్నారు. చరణ్ అన్నకు ఎప్పటికీ రుణపడి ఉంటాము. త్వరలోనే ఆయన చేతుల మీదుగా హెల్త్ కార్డ్స్ తీసుకోవడానికి డ్యాన్సర్స్ వెయిట్ చేస్తున్నారు” అంటూ చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ మంచి మనసు గురించి తెలిసి మరోసారి సంతోషం వ్యక్తం చేస్తున్నారు మెగా అభిమానులు.

ఎక్కువ మంది చదివినవి : Anushka Shetty : ఆ హీరో నాకు చాలా స్పెషల్.. అతడే నాకు గాడ్ ఫాదర్.. నా జీవితాన్ని మార్చేశాడు.. అనుష్క కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : Actor : అందంగా లేని హీరోని పెట్టి తీయడం వల్లే ఆ సినిమా ప్లాప్ అయ్యింది.. నటుడు రవిబాబు..

Loading...
Unable to load recommendations.
Follow Us