తమ్ముడి సినిమా చూస్తూ తెగ ఎంజాయ్ చేసిన చిరు.. ఫ్యామిలీతో ఉస్తాద్ భగత్ సింగ్ చూసిన మెగాస్టార్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. అలాగే కోలీవుడ్ స్టార్ నటుడు, దర్శకుడు పార్తీబన్ విలన్ గా మెప్పించారు. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు.

తమ్ముడి సినిమా చూస్తూ తెగ ఎంజాయ్ చేసిన చిరు.. ఫ్యామిలీతో ఉస్తాద్ భగత్ సింగ్ చూసిన మెగాస్టార్..
Chiranjeevi

Updated on: Mar 21, 2026 | 5:04 PM

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఉస్తాద్ భగత్ సింగ్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఉగాది కానుకగా గురువారం (మార్చి 19) రిలీజైన ఈ సినిమా మరీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోకపోయినా బాగుందన్న కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇక పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు మాత్రం ఈ మూవీ తెగ నచ్చేస్తోంది. రోజు రోజుకు ఈ సినిమాకు పాజిటివ్ టాక్ పెరుగుతూ వస్తుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో శ్రీలీల , రాశీ ఖన్నా హీరోయిన్స్ గా నటించారు. అలాగే పవన్ కళ్యాణ్ ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించి ఆకట్టుకున్నాడు. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సమేతంగా చూశారు. సినిమా చూస్తూ చిరు తెగ ఎంజాయ్ చేశారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us