
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా స్వయనా మేనల్లుడైన చిరంజీవి సర్జాకి కన్నడలో యాక్షన్ హీరోగా గుర్తింపు ఉండేది. ప్రస్తుతం కేడీ ది డెవిల్ సినిమాతో థియేటర్లలో రచ్చ చేస్తోన్న ధ్రువ్ సర్జాకు చిరంజీవి సొంత అన్నవుతాడు. కన్నడలో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిర చిరంజీవి సర్జా 2020లో సడెన్ గా గుండెపోటుతో మరణించారు. దీంతో ఆయనను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్ మేఘనా రాజ్ తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయింది. దీనికి తోడు భర్త చనిపోయేనాటికి ఆమె నిండు గర్భంతో ఉంది. దీంతో చాలా రోజుల వరకు ఈ విషాదం నుంచి బయటకు రాలేకపోయింది మేఘన. ఆమె సాధారణ స్థితికి చేరుకోవడానికి చాలా ఏళ్లు పట్టింది. ప్రస్తుతం పుట్టిన బిడ్డలోనే తన భర్తను చూసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తోంది మేఘనా రాజ్. కాగా పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైందీ అందాల తార. అయితే ఈ మధ్యన మళ్లీ కెమెరా ముందుకు వచ్చింది. ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2లో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఇదే క్రమంలో కొడుకుతో పాటు రజనీకాంత్ ను కలిసిన ఆమె ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అనంతరం తన భర్తను తల్చుకుంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
ఈ సందర్భంగా రజనీతో దిగిన ఫొటోలోని పంచుకున్న మేఘనా సర్జా.. తన భర్తకు ఎంతో ఇష్టమైన భాషా బొమ్మపై స్వయంగా రజనీతో సంతకం కూడా చేయించింది. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఈ రోజు ఒక తేదీ మాత్రమే కాదు మన ఇద్దరి కల ఒక్కటైన రోజు. నా ప్రతి అడుగులోనూ నిన్ను ఫీలవుతున్నాను. నువ్వు ఆయనని(రజనీకాంత్) ఎంత ఆరాధించావో నాకు బాగా తెలుసు. నీ కోరిక వల్లే ఆయనని నేను కలిశాను. ఇది అసలు నేను కలలో కూడా ఊహించని విషయం. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం ‘జైలర్ 2’లో లభించింది. మనం సాధించాం. నా భర్తకే ఈ సినిమా అంకితం చేస్తున్నాను. ఈ సక్సెస్ అంతా ఆయనకే చెందుతుంది’ అని మేఘనా సర్జా భావోద్వేంగా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కాగా మేఘనా రాజ్ గతంలో పలు తెలుగు సినిమాల్లో నటించింది. అల్లరి నరేశ్ ‘బెండు అప్పారావు’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె శ్రీకాంత్ లక్కీ సినిమాలోనూ కథానాయికగా చేసింది. ఆ తర్వాత పలు కన్నడ, మలయాళ మూవీస్ చేసింది. ఇదే క్రమంలో హీరో చిరంజీవి సర్జాను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.