ఇప్పుడేం కొత్త కాదు.. గతంలో ఇండస్ట్రీలో స్టార్స్‌గా రాణిస్తున్న స్టార్స్.. వారి కుటుంబంలోని వారిని చిత్ర పరిశ్రమకు పరిచయం చేసేవాళ్లు. తమ బంధువుల పిల్లలను.. సొంత బ్రదర్స్ లేదా సిస్టర్స్‌ను ఎంకరేజ్ చేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అలా అక్కాచెల్లెళ్లు చాలామందే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్‌గా రాణించారు. ఆ లిస్ట్‌లో సీనియర్ హీరోయిన్ నగ్మ సిస్టర్స్ ఉన్నారు. అవునా.. నగ్మ సోదరి కూడా హీరోయినా అని నోరెళ్లబెట్టకండి. ఒకరు కాదు ఆమె ఇద్దరు సోదరీమణులు హీరోయిన్సే. నగ్మ రెండో చెల్లి ఇప్పటికీ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణిస్తోంది. తను ఓ స్టార్ హీరో సతీమణి కూడా. ఏమైనా గెస్ చేశారా…? తను మరెవరో కాదు జ్యోతిక. నగ్మా మరో సిస్టర్ రోషిణి కూడా హీరోయిన్‌గా చేసి ప్రస్తుతం గృహిణిగా సెటిలైపోయింది.
వీరిందరిలో నగ్మానే పెద్దది. జ్యోతిక రెండోది కాగా రోషిణి ముగ్గురిలో చిన్నది. ముగ్గురూ తమిళనాడుకు చెందనవారు. అయితే ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు తెలుగులో ఓ స్టార్ హీరో సరసన నటించారు. ఆయన మరెవరో కాదు.. మన మెగాస్టార్ చిరంజీవి. అప్పట్లో చిరు- నగ్మా.. హిట్ పెయిర్‌గా ఇండస్ట్రీని ఏలేశారు. వీరు నటించిన రిక్షావోడు, ఘరానా మొగుడు, ముగ్గురు మొనగాళ్లు బ్లాక్ బాస్టర్ హిట్స్‌గా నిలిచాయి. 1997 లో మాస్టర్ సినిమాతో రోషిణి కూడా చిరు పక్కన నటించింది. జ్యోతిక… 2003లో ఠాగూర్ సినిమాలో చిరు పక్కన ఆడిపాడింది. ఇలా ఈ ముగ్గురు అక్కచెల్లెళ్ళతో నటించిన ఏకైక హీరోగా చిరు గుర్తింపు పొందాడు. అయితే వీరితో నటించిన అన్ని సినిమాలు హిట్ కావడం మరో విశేషం.
#Chiru❤️ pic.twitter.com/AjYIKpzWR9
— Megastar Chiranjeevi (@ChiruFanClub) September 9, 2018
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి