Tollywood: ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోను గుర్తుపట్టగలరా..? తెలుగులో ఫస్ట్ పాన్ ఇండియా స్టార్..

|

Aug 29, 2024 | 1:09 PM

సౌత్ టూ నార్త్ అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరో. మాస్ యాక్షన్, లవ్ రొమాంటిక్ చిత్రాలైనా.. ఆధ్యాత్మిక మూవీస్ అయినా తనదైన నటనతో అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నాడు. పరాజయాలతో సంబంధం లేకుండా కొత్త దర్శకులను తెలుగు సినీరంగానికి పరిచయం చేస్తుంటాడు. ఇప్పటివరకు దాదాపు 40 మంది దర్శకులను తెలుగు తెరకు పరిచయం చేశాడు. అలాగే ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించాడు. ఇంతకీ ఆ హీరో ఎవరా అనుకుంటున్నారా.. ?

Tollywood: ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోను గుర్తుపట్టగలరా..? తెలుగులో ఫస్ట్ పాన్ ఇండియా స్టార్..
Actor
Follow us on

సోషల్ మీడియాలో ఓ త్రోబ్యాక్ ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పైన ఫోటోను చూశారు కదా.. అదే.. అందులో టాలీవుడ్ స్టార్ హీరో ఉన్నాడు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధంలేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆ స్టార్ హీరో ఒకప్పుడు.. ఇప్పుడు.. ఎప్పటికీ అమ్మాయిల కలల రాకుమారుడు. ఈ హీరోకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. సౌత్ టూ నార్త్ అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరో. మాస్ యాక్షన్, లవ్ రొమాంటిక్ చిత్రాలైనా.. ఆధ్యాత్మిక మూవీస్ అయినా తనదైన నటనతో అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నాడు. పరాజయాలతో సంబంధం లేకుండా కొత్త దర్శకులను తెలుగు సినీరంగానికి పరిచయం చేస్తుంటాడు. ఇప్పటివరకు దాదాపు 40 మంది దర్శకులను తెలుగు తెరకు పరిచయం చేశాడు. అలాగే ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించాడు. ఇంతకీ ఆ హీరో ఎవరా అనుకుంటున్నారా.. ? అతడే టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున.

దివంగత హీరో అక్కినేని నాగేశ్వర రావు నట వారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తెలుగులో ఎన్నో హిట్స్ అందుకున్నప్పటికీ నిన్నే పెళ్లడతా సినిమాతో నాగ్ క్రేజ్ ఊహించని రేంజ్ లో మారిపోయింది. అంతేకాదు పాన్ ఇండియా లెవల్లో నాగార్జున ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. ఈరోజు నాగార్జున పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన త్రోబ్యాక్ ఫోటోస్, వీడియోస్ నెట్టింట షేర్ చేస్తూ తమ అభిమాన హీరోకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి

Nagarjuna Childhood

ఈ సందర్భంగా గతంలో డైరెక్టర్ కృష్ణవంశీ మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ తెలుగులో ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీ రూపురేఖలను మార్చిన హీరో నాగార్జున అని.. వేరే డైరెక్టర్లను తీసుకువచ్చి.. వేరే రకమైన సినిమాలను చేశారని.. అంతేకాకుండా వాటికి తనే పెట్టుబడి పెట్టి హీరోగా ఉండి.. కొన్నింటిని నిర్మించి ఆడియన్స్ వ్యూస్ నే మార్చేశాడని కృష్ణవంశీ అన్నారు. మణిరత్నం, ప్రియదర్శన్, ఫాజిల్, రవిచందర్, మహేష్ భట్ ఇలా చాలా మంది డైరెక్టర్లతో అప్పట్లోనే సినిమాలు చేసాడని.. చిన్న క్యారెక్టర్ అయినా బాంబే వెళ్లి చేసి వచ్చేవాడని.. పాన్ ఇండియా అనే మాటకు మొదట ఫౌండేషన్ వేసిందే నాగార్జున అంటూ చెప్పుకొచ్చారు.

వీడియో చూడండి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.