KTR: ప్యారడైజ్ సినిమా చూసిన కేటీఆర్.. కేసీఆర్ పాత్ర గురించి ఏమన్నారంటే

నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ది ప్యారడైజ్ బాక్సాఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్ అందుకుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్‌కు ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్‌తో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. తొలిరోజు వసూళ్లలోనూ తన సత్తా చాటింది.

KTR: ప్యారడైజ్ సినిమా చూసిన కేటీఆర్.. కేసీఆర్ పాత్ర గురించి ఏమన్నారంటే
Ktr

Updated on: Sep 27, 2026 | 7:02 AM

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్‌కు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది పారడైజ్’ సినిమాను పార్టీ సభ్యులతో కలిసి వీక్షించారు కేటీఆర్ . చాలా ఏళ్ల తర్వాత థియేటర్‌లో సినిమా చూశానని ఎక్స్‌లో వెల్లడించారు. సినిమా చాలా బాగుందని, దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారని, నాని నటన ఆకట్టుకుందని కేటీఆర్ ప్రశంసించారు. ఎమ్మెల్యే శంకరన్న పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువేనని, ఆ పాత్ర స్ఫూర్తి ఏమిటో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. కేటీఆర్ రాకతో థియేటర్ వద్ద అభిమానులు, ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు. చాలా ఏళ్ల తర్వాత థియేటర్‌లో సినిమా చూసేందుకు వచ్చినట్లు ఎక్స్ ( ట్విట్టర్) ద్వారా వెల్లడించిన కేటీఆర్.

నాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన “ది పారడైజ్” చిత్రాన్ని చూశారు కేటీఆర్. తనకు ఇష్టమైన నటుడు నాని సినిమాను చూసేందుకు శనివారం రాత్రి థియేటర్‌కు వెళ్లారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. సినిమాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హావభావాలు, స్టైలింగ్‌ను పోలి ఉండే “శంకరన్న” (ప్రియదర్శి) పాత్రపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేటీఆర్ రాకతో థియేటర్ ఆవరణకు భారీగా ప్రేక్షకులు, అభిమానులు చేరుకున్నారు. .

సినిమా చూసిన తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ.. ది పారడైజ్ సినిమా చాలా బాగుంది. సామాజిక అంశాన్ని బలంగా తెరపై ఆవిష్కరించారు. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. కథ, పాత్రలు, సన్నివేశాలను ప్రభావవంతంగా చూపించారు. నాని అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు.  పాత్రకు పూర్తిగా న్యాయం చేశారని కేటీఆర్ అన్నారు. అలాగే MLA శంకరన్న పాత్ర ప్రత్యేక ఆకర్షణ, ఆ పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాలోని సామాజిక అంశాలు, పాత్రల సంఘర్షణ ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయని అన్నారు కేటీఆర్.   అభినందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us