
ఆదిపురుష్ భామ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ ఊహించని విధంగా ఓ వివాదంలో చిక్కుకుంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆమె నటించిన రక్షా బంధన్ యాడ్ లో ఆమె ధరించిన దుస్తులు తీవ్ర వివాదస్పదమయ్యాయి. దీనికి తోడు సోదరులకు ప్రేమతో కట్టే రాఖీని కుక్కకు కట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కంగనా రనౌత్ లాంటి సినీ ప్రముఖులు సైతం కృతి సనన్ పై తీవ్రంగా మండిపడుతున్నారు. హిందూ పండగలను అవమానించేలా కృతి సనన్ వ్యవహరించారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తనపై వస్తోన్న విమర్శలు, సోషల్ మీడియా ట్రోల్స్ పై కృతి సనన్ స్పందించింది. ఈ మేరకు ఇన్ స్టా స్టోరీస్ లో వరుస పోస్టులు పెట్టింది. ‘పండుగ అనేది భావోద్వేగాలు, సంప్రదాయాలతో కూడుకున్నది. అంతే కానీ మనం ధరించే దుస్తుల్లో ఉండదు. రక్షాబంధన్ అనేది ఒక రక్షణ బంధం. నేను, నా సోదరి ఒకరికొకరం రాఖీ కట్టుకుంటాం. ఒక సోదరుడు ఎలాగైతే రక్షణగా ఉంటారో.. మేము కూడా అలాగే రక్షించుకోగలమని మాకు తెలుసు. తాను, తన సోదరి ఒకరి ఆరోగ్యం, సంతోషం, దీర్ఘాయువు కోసం ప్రార్థించుకుంటాం. ఇది మా ఇంట్లో కుక్కలకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే అవీ కూడా మా కుటుంబంలో సభ్యులే కదా’ అని కృతి రాసుకొచ్చింది.
.
ఇక ఈ ప్రకటనలో తాను ధరించిన దుస్తులపై వస్తోన్న విమర్శలకు కూడా కృతి కౌంటర్ ఇచ్చింది. ‘ మనం మహిళలు ఏమి ధరించాలో చెప్పడం ఎప్పుడు ఆపుతాం? ఒక మహిళ తన సంస్కృతి పట్ల చూపే గౌరవాన్ని ఆమె దుస్తులను బట్టి అంచనా వేసే పద్ధతి సరైనది కాదు. ఎథ్నిక్ ఫ్యాషన్ సంవత్సరాలుగా అభివృద్ధి చెందింది.. కానీ ఇప్పటికీ ఒక మహిళ తన సంస్కృతి పట్ల చూపే గౌరవాన్ని కేవలం ఆమె దుస్తులతోనే కొలుస్తున్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలు అనే మహిళ హృదయంలో ఉంటాయి.. అంతే కానీ ఆమె మెడలో కాదు’ అని పేర్కొంది కృతి సనన్. ప్రస్తుతం ఈ హీరోయిన్ పోస్టుల నెట్టింట వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు కృతికి సపోర్టుగా నిలుస్తుంటే మరికొందరు ఆమెపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
Kriti Sanon Instagram Post
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.