అమితాబ్ కుటుంబంలో ఆస్తి వివాదం.. అనుమతి లేకుండా ఆస్తి బదలాయించారని ఆరోపణ

అమితాబ్ కుటుంబంలో జల్సా బంగ్లాపై ఆస్తి వివాదం రేగింది. 1993 నాటి గిఫ్ట్ డీడ్‌పై అమితాబ్ మరదలు రమోలా అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రికార్డుల్లో రమోలా పేరు.. సొసైటీ రికార్డుల్లో జయా బచ్చన్ పేర్లు ఉన్నాయి. దాంతో జల్సా యాజమాన్య హక్కులపై రమోలా బచ్చన్ సవాల్ చేశారు.  అనుమతి లేకుండా ఆస్తి బదలాయించారని రమోలా బచ్చన్ ఆరోపిస్తున్నారు.

అమితాబ్ కుటుంబంలో ఆస్తి వివాదం.. అనుమతి లేకుండా ఆస్తి బదలాయించారని ఆరోపణ
Amitabh Bachchan

Updated on: Nov 15, 2026 | 9:57 AM

అమితాబ్ కుటుంబంలో జల్సా బంగ్లాపై ఆస్తి వివాదం రేగింది. 1993 నాటి గిఫ్ట్ డీడ్‌పై అమితాబ్ మరదలు రమోలా అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రికార్డుల్లో రమోలా పేరు.. సొసైటీ రికార్డుల్లో జయా బచ్చన్ పేర్లు ఉన్నాయి. దాంతో జల్సా యాజమాన్య హక్కులపై రమోలా బచ్చన్ సవాల్ చేశారు.  అనుమతి లేకుండా ఆస్తి బదలాయించారని రమోలా బచ్చన్ ఆరోపిస్తున్నారు. జల్సా వివాదంపై డిప్యూటీ రిజిస్ట్రార్ విచారణ ప్రారంభం అయ్యింది. ఇది అంతర్గత కుటుంబ వ్యవహారమని అభిషేక్ బచ్చన్ ప్రతినిధి తెలిపారు.

ఏడు నెలలుగా రమోలా బచ్చన్ ఈ అంశంపై రిజిస్ట్రేషన్ అధికారుల దగ్గర వరుస ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు. అమితాబ్ బచ్చన్ జల్సా బంగ్లా కుటుంబ వివాదానికి కార‌ణమైంది. ముంబైలోని కపోల్ హౌసింగ్ సొసైటీ రికార్డుల్లో జల్సా బంగ్లా యజమానిగా జయా బచ్చన్ పేరు నమోదై ఉంది. అయితే, మహారాష్ట్ర ప్రభుత్వ ప్రాపర్టీ కార్డులో మాత్రం ఇప్పటికీ రమోలా బచ్చన్ పేరే కొనసాగుతోంది. ప్రభుత్వ రికార్డుల్లో రమోలా పేరును తొలగించి, జయా బచ్చన్ పేరును చేర్చేందుకు ప్రయత్నాలు జరిగిన సమయంలోనే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

అంతేకాకుండా 1993 నాటి ఆ గిఫ్ట్ డీడ్‌ను ఎలాంటి స్టాంప్ డ్యూటీ చెల్లించకుండా.. సాక్షులు లేకుండా తెల్ల కాగితంపై తయారు చేశారని.. తర్వాత అభయ్ యోజన పథకం కింద దానిని క్రమబద్ధీకరించిన తీరుపైనా అమితాబ్ సోద‌రుని భార్య‌ ర‌మోలా ప్రశ్నలను లేవనెత్తారు. ప్రస్తుతం అంధేరిలోని డిప్యూటీ రిజిస్ట్రార్ విచారణ ప్రారంభించారు. మరోవైపు, అమితాబ్ బచ్చన్ కుటుంబం ఈ వివాదంపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ అభిషేక్ బచ్చన్ ప్రతినిధి మాత్రం ఇది కుటుంబ అంతర్గత వ్యవహారమని మాట్లాడేందుకు నిరాకరించారు. 33ఏళ్ల కిందటి హై-ప్రొఫైల్ ఆస్తి అసలు వారసులెవరు అనే దానిపై అధికారుల తుది నిర్ణయం ఎటువైపు మొగ్గు చూపుతుందనేది ఇప్పుడు బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us