AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుమన్ అన్నే తోపు.. దమ్ముంటే ఆపు..! 100శాతం హిట్ అన్న ప్రేక్షకులు..

బిగ్ బాస్ సీజన్ 9 రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతుంది. వారాంతం వస్తే చాలు కింగ్ నాగార్జున ఎంట్రీతో అదరగొడుతున్నారు. శనివారం హౌస్ మేట్స్ కు ఓ రేంజ్ లో క్లాస్ తీసుకునే నాగార్జున ఆదివారం హౌస్ మేట్స్ తో ఆటలాడించి, పాటలు పాడించి ఒకరిని ఎలిమినేట్ చేసి హౌస్ నుంచి బయటకు తీసుకు వచ్చేస్తారు..

సుమన్ అన్నే తోపు.. దమ్ముంటే ఆపు..! 100శాతం హిట్ అన్న ప్రేక్షకులు..
Bigg Boss9
Rajeev Rayala
|

Updated on: Nov 08, 2025 | 8:23 PM

Share

బిగ్ బాస్ హౌస్ లో అంతో ఇంతో జన్యున్ గా ఆడుతున్నది ఎవరు అంటే ప్రేక్షకులు చెప్పే మాట సుమన్ శెట్టి. తన గేమ్ తాను ఆడుతూ.. హౌస్ లో ఎవరితో అనవసరంగా గొడవలు, వాదనలు పెట్టుకోకుండా.. తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు సుమన్ శెట్టి.. టాస్క్ ల్లోనూ తన సత్తా చాటుతున్నాడు. ప్రేక్షకుల్లో సుమన్ శెట్టికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. సుమన్ శెట్టి నామినేషన్స్ లోకి వస్తే ప్రేక్షకులు ఆయనను తమ ఓట్లతో టాప్ లో ఉండేలా చేస్తున్నారు. సుమన్ శెట్టి పై అనవసరంగా ఎవరైనా గొడవ పెట్టుకుంటే బయట ప్రేక్షకులు కోపంతో ఊగిపోతున్నారు. అంతలా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు సుమన్ శెట్టి. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో కూడా ప్రేక్షకులు సుమన్ కు 100శాతం హిట్ అంటూ రేటింగ్ ఇచ్చేశారు.

బిగ్ బాస్ నుంచి తాజాగా ఓ ప్రోమో విడుదలైంది. శివ సినిమా రీ రిలీజ్ ఉండటంతో నాగ్ శివ గెటప్ లో ఎంట్రీ ఇచ్చారు. ఇక అమల, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేశారు. ఇక ఇప్పుడు విడుదల చేసిన ప్రోమోలో నాగార్జున ప్రేక్షకులను హౌస్ లో ఉన్న వారి పేర్లు చెప్తా.. ఈ సీజన్ లో వాళ్లు హిట్టా , ఫ్లాపా అన్నది మీరే డిసైడ్ చేయాలి అని చెప్పారు. దాంతో ప్రేక్షకులు తమ ఓటింగ్ వేశారు.

ఆతర్వాత ప్రేక్షకుల ఓటింగ్ చూపించారు నాగ్.. సుమన్ శెట్టికి వంద శాతం హిట్ అంటూ ఓటింగ్ వేశారు ప్రేక్షకులు. ఆతర్వాత ఇమ్మాన్యుయేల్ కు 95, తనూజాకు 93, కళ్యాణ్ కు 79, రీతూ కి 79, డిమాన్ 72, గౌరవ్ 69, రాము 59, నిఖిల్ 45, సంజన 43, భరణి 35 ప్లేస్ లో ఉన్నారు. టాప్ 6 కు బంపర్ ఆఫర్ ఉంటుంది అని నాగ్ చెప్పారు. టాప్ లో ఉన్న సుమన్ శెట్టిని డైరెక్టర్ కెప్టెన్సీ కంటెండర్ చేశారు.. కానీ అది దక్కాలి అంటే భరణి ఫ్యామిలీ వీక్ త్యాగం చేయాలనీ చెప్పారు. అలాగే తనూజాకు త్వరలో మీ చెల్లి పెళ్లి ఉంది.. ఆమె నుంచి వాయిస్ మెసేజ్ వచ్చింది.. అది కావలి అంటే కళ్యాణ్ మళ్లీ క్యాప్టెన్ అయినా కూడా ఇమ్యూనిటీ ఉండదు సీజన్ మొత్తం అని చెప్పారు నాగ్. ఆతర్వాత రీతూ తండ్రి షర్ట్ ను పంపించి అది నీకు కావాలి అంటే సంజన చీరాలన్నీ స్టోర్ రూమ్ లో పెట్టాలి అని కండీషన్ పెట్టారు నాగ్. చివరిగా ఇమ్మూ గర్ల్ ఫ్రెండ్ నుంచి వాయిస్ మెసేజ్ వచ్చింది. అది కావాలి అంటే గౌరవ్ దగ్గరున్న బిగ్ బ్లసీ పవర్ పోతుంది అని చెప్పారు నాగ్. దాంతో ఇమ్మూ వాయిస్ మెసేజ్ కావాలి అని చెప్పాడు. దాంతో ఆమె వాయిస్ మెసేజ్ ను వినిపించారు. ఆతర్వాత గౌరవ్ కు, ఇమ్మూకి వాదనజరిగింది.

మరిన్ని సినిమా కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

జనాలు రోడ్డు మీదకి వచ్చి టపాసులు కాల్చుతున్నారంటే.. అర్థమైందిలే..
జనాలు రోడ్డు మీదకి వచ్చి టపాసులు కాల్చుతున్నారంటే.. అర్థమైందిలే..
వామ్మో.. స్నానం చేయకుండా టిఫిన్ తింటే ఇంత డేంజరా.. గరుడపురాణం..
వామ్మో.. స్నానం చేయకుండా టిఫిన్ తింటే ఇంత డేంజరా.. గరుడపురాణం..
పార్లర్‌కి వెళ్లాల్సిన పనే లేదు ఈ టిప్స్‌తో మెరిసే చర్మం మీ సొంతం
పార్లర్‌కి వెళ్లాల్సిన పనే లేదు ఈ టిప్స్‌తో మెరిసే చర్మం మీ సొంతం
యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, రోహిత్ సరసన చోటు
యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, రోహిత్ సరసన చోటు
అనంత్ అంబానీ ధరించిన వాచ్ ధర ఎంతో తెలిస్తే మతిపోతుంది!
అనంత్ అంబానీ ధరించిన వాచ్ ధర ఎంతో తెలిస్తే మతిపోతుంది!
ఒక రాత్రి.. రెండు ప్రాణాలు.. తల్లీకొడుకుల మరణం వెనక ఏం జరిగింది?
ఒక రాత్రి.. రెండు ప్రాణాలు.. తల్లీకొడుకుల మరణం వెనక ఏం జరిగింది?
ముద్దుగున్న పొద్దుతిరుగుడుతో పుష్కలమైన ఆరోగ్యం.. విత్తనాలే కాదు..
ముద్దుగున్న పొద్దుతిరుగుడుతో పుష్కలమైన ఆరోగ్యం.. విత్తనాలే కాదు..
మళ్లీ విజృంభిస్తున్న కోహ్లీ ఫాంకు సీక్రెట్ అదేనట
మళ్లీ విజృంభిస్తున్న కోహ్లీ ఫాంకు సీక్రెట్ అదేనట
నిజంగా జీలకర్ర నీరు తాగితే పొట్ట తగ్గుతుందా.. అపోహలు కాదు..
నిజంగా జీలకర్ర నీరు తాగితే పొట్ట తగ్గుతుందా.. అపోహలు కాదు..
ఇంటి అద్దె ఎగ్గొట్టడానికి ఇంత దారుణమా..?
ఇంటి అద్దె ఎగ్గొట్టడానికి ఇంత దారుణమా..?