బిగ్ బాస్ సీజన్ 8 మొదటి రోజు నుంచే హీటు మొదలైంది. తొలి రోజే సోనియా, శేఖర్ బాషా మధ్య రచ్చ జరిగిన విషయం తెలిసిందే. ఆతర్వాత నిన్నటి ఎపిసోడ్‌లో నామినేషన్స్ ప్రక్రియ మొదలు పెట్టారు బిగ్ బాస్. ముందుగా సోనియా బేబక్కను, ప్రేరణ ను నామినేట్ చేసింది. ఆతర్వాత నబీల్ నాగ మణికంఠ, బేబక్కను నామినేట్ చేశాడు. ఆ తర్వాత శేఖర్ బాషా నాగ మణికంఠను, బేబక్కను నామినేట్ చేశాడు. ఇక ఇపుడు నేటి ఎపిసోడ్ కు సంబందించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమో చూస్తుంటే ఈ రోజు కూడా గట్టిగానే నామినేషన్స్ లో గొడవలు జరిగినట్టు తెలుస్తోంది. నేటి ఎపిసోడ్ లోనూ బేబక్క వర్సెస్ సీత మధ్య మళ్లీ కూర గురించే గొడవ మొదలైంది. నాకు ఇచ్చిన ఎగ్ తో నేను బురిజీ వేసుకుంటానంటే వద్దన్నావ్ అంటూ ఆమెను నామినేట్ చేసింది సీత.
ఆతర్వాత సోనియా.. విష్ణు ప్రియ మధ్య రచ్చ జరిగింది. మరోసారి సోనియా రెచ్చిపోయింది. తన వాదనతో విష్ణు ప్రియకు ఇచ్చిపడేసింది. రెస్పాన్సిబిలిటీ తీసుకొనేప్పుడు. పక్కకి వెళ్లి అంతే హ్యాపీగా ఉండు ఛిల్ల్ కొట్టు అని గట్టిగా ఇచ్చింది సోనియా. ఆతర్వాత అభినయ్ కు నాగ మణికంఠను నామినేట్ చేశాడు. హైపర్ ఒక్కసారి అవ్వొచ్చు.. కానీ సెకండ్ టైం కాస్త కామ్ అవ్వాలి అని అన్నాడు. దానికి నాగమణికంఠ వాదించాడు.. గట్టిగా అరుస్తూ డిఫైన్ చేసుకునే ప్రయత్నం చేశాడు.
ఆ తర్వాత కిరాక్ సీత ప్రేరణను నామినేట్ చేసింది. ఆలాగే విష్ణు ప్రియా నాగమణికంఠను నామినేట్ చేసింది. ఇక శేఖర్ బాషా నాగ మణికంఠను నామినేట్ చేస్తూ.. ప్రతిదానికి నువ్వు రాజకీయం చేస్తున్నావ్ అని అనేశాడు. అంతే.. నాగమణికంఠ సెంటిమెంట్ స్టోరీ మొదలు పెట్టాడు. కానీ అతని మాటలకు అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు.” చావుదాకా వెళ్లి వచ్చా మీరు చూడలేదు. నాన్నను పోగొట్టుకున్న.. పెంచిన తండ్రి అవమానించిన భరించా.. అమ్మ చనిపోయింది. శవాన్ని కాల్చడానికి డబ్బులు లేక అడుక్కొని వచ్చి కట్టెలు పేర్చి మా అమ్మ శవాన్ని దహనం చేశా”.. అని కన్నీళ్లు పెట్టుకున్నాడు నాగమణికంఠ. అతని మాటలకూ హౌస్ లో ఉన్న వారు బోరున ఏడ్చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి