
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 తొమ్మిదో వారం చివరి దశకు చేరుకుంది. గత రెండు వారాల్లాగే ఈసారి కూడా హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని భావించారు. ఈ వారం ఎలిమినేషన్ కు సంబంధించి మొత్తం 10 మంది కంటెస్టెంట్లు నామినేషన్స్ లో ఉన్నారు. యాంకర్ వర్షిణి, ముఖేష్ గౌడ, అమన్ మసూద్, టెంపర్ వంశీ, నీతు మాస్టర్, శివ, నరేష్, దేబ్జానీ, సుధీర్, రాంప్రసాద్ ఈ వారం ఎలిమినేషన్ ముప్పు ఎదుర్కొంంటున్నారు.వీరి ఓటింగ్ విషయానికి వస్తే.. రోహిత్ లేకపోవడం, త్రిగుణ్ కూడా నామినేషన్స్ నుంచి తప్పుకోవడంతో ముఖేష్ గౌడ కి భారీగా ఓట్లు పడ్డాయి.ప్రస్తుతం ఆయన టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నారు. ఇక త్రిగుణ్ సపోర్ట్ తో పాటు కెప్టెన్సీ కూడా కలిసి రావడంతో టెంపర్ వంశీ రెండవ స్థానంలో దూసుకుపోతున్నారడు. ఆ తర్వాత రాంప్రసాద్, అమన్, నరేష్, దెబ్జానీలు ఉన్నారు. ప్రస్తుతం వీరంతా సేఫ్ జోన్ లోనే ఉన్నారు. యాంకర్ వర్షిణీ, శివకుమార్, సుధీర్ కు చాలా తక్కువ ఓట్లు పడ్డాయి.
ఓటింగ్ పరంగా యాంకర్ వర్షిణీ, సుధీర్ చివరి స్థానాల్లో నిలిచారు. గతవారం ముఖేష్ పవర్ ద్వారా త్రుటిలో ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్న సుధీర్ లేదా యాంకర్ వర్షిణీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవుతారని వార్తలు వచ్చాయి. అయితే ఇలాంటి సమయంలో కంటెస్టెంట్స్ కి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు బిగ్ బాస్.
కాగా గతంలో సరిగ్గా దసరా పండగ రోజున ఎలిమినేట్ అయ్యింది శాలినీ పటేల్. అయితే పండగ పూట ఇంటికి ఏడూస్తూ వెళ్లడం సరికాదని ఆమెకు సీక్రెట్ రూమ్ కు పంపించి సేవ్ చేశాడు బిగ్ బాస్. ఇప్పుడు తొమ్మిదో వారంలోనూ సరిగ్గా ఇలాగే జరగనుందని సమాచారం. ఆదివారం (నవంబర్ 11) దీపావళి కావడంతో ఈ తొమ్మిదవ వారంలో ఎలాంటి ఎలిమినేషన్ ఉండకపోవచ్చు అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. పండుగను పురస్కరించుకొని దీపావళి ధమాకా ట్రీట్ గా బిగ్ బాస్ మేకర్స్ ఈ వారం ఎలిమినేషన్ ను రద్దు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఇదే గనుక నిజమైతే డేంజర్ జోన్ లో ఉన్న సుధీర్, యాంకర్ వర్షిణీలకు ఇది పెద్ద ఊరట అని చెప్పవచ్చు. దీనిపై ఫుల్ క్లారిటీ రావాలంటే ఈ వీకెండ్ ఎపిసోడ్ దాకా వేచి చూడాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి