
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా, ఆసక్తికరంగా సాగుతోంది. ముఖ్యంగా కంటెస్టెంట్స్, ఆడియెన్స్ అంచనాలకు అందుకోకుండా బిగ్ బాస్ భలే ట్విస్టులు ఇస్తున్నాడు. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా మూడు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు నాలుగో వారం ఎండింగ్ కు కూడా చేరుకుంది. కాబట్టి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.బిగ్ బాస్ మొదటి వారం లో చైత్ర ఎలిమినేట్ అయ్యింది. ఆ తరవాత రెండవ వారం లో నటుడు కృష్ణుడు ఎలిమినేటయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. ఇక మూడో వారం ముఖేష్ త్యాగం కారణంగా ఎలిమినేషన్ జరగలేదు. దీంతో నాలుగో వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉండనుందని తెలుస్తోంది. నాలుగో వారం ఎలిమినేషన్ కు సంబంధించి మొత్తం తొమ్మిది మంది కంటెస్టెంట్లు నామినేషన్స్‌లో ఉన్నారు. ముఖేష్ గౌడ, త్రిగుణ్, దేబ్జానీ, రోహిత్, షాలిని, అమన్, నరేష్, చరణ్, సృష్టి ఈ వారం ఎలిమినేషన్‌ను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతమున్న ఓటింగ్ ట్రెండ్స్ ను ఒకసారి పరిశీలీస్తే.. స్టార్ కంటెస్టెంట్ త్రిగుణ్ కు భారీగా ఓట్లు పడుతున్నాయి. దీంతో ఇప్పుడు అతను టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. గత వారం కంటే ఈ వారం ఓటింగ్‌లోనే త్రిగుణ్ కు భారీ మద్దతు లభిస్తోంది. త్రిగుణ్ తర్వాత 13.17 శాతం ఓట్లతో రోహిత్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక హౌస్ లో నిలకడైన ఆట, మాట తీరుతో ఆకట్టుకుంటోన్న సీరియల్ నటుడు ముఖేష్ కు రోజు రోజుకు ఫ్యాన్ బేస్ పెరుగుతోంది. మొన్నటి వరకు ఐదో స్థానంలో ఉన్న ముఖేష్ ప్రస్తుతం మూడో స్థానానికి చేరుకున్నాడు. వీరి తర్వాత జబర్దస్త్ నాలుగో ప్లేస్ లో ఉన్నాడు. అలాగే ఐదో స్థానంలో అమన్ మసూద్, ఆరో స్థానంలో శాలినీ, ఏడో ప్లేసులో దేబ్జానీ, ఎనిమిదో స్థానంలో చరణ్, తొమ్మిదో ప్లేసులో సృష్టి ఉన్నారు.
అంటే ప్రస్తుతం చరణ్, సృష్టి డేంజర్ జోన్ లో ఉన్నారన్నమాట. నిజానికి రెండవ వారమే కృష్ణుడు స్థానంలో సృష్టి ఎలిమినేట్ కావాల్సి ఉండగా.. కృష్ణుడిని ఆడియన్స్ మొదట ఎలిమినేట్ చేశారు. దీనికి తోడు సుధీర్ పట్ల ఆమె వ్యవహరించిన తీరు కారణంగా సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ కు గురైంది సృష్టి. కాబట్టి ఈ వారంలో సృష్టినే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. ఒక వేళ డబుల్ ఎలిమినేషన్ జరిగితే.. చరణ్ కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉంది. మొదటి వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా ఎలిమినేట్ అయిన చరణ్ కు మళ్ళీ వారం ఆయనకు రెండవ అవకాశం కల్పించారు. అయితే ఈ అవకాశాన్ని కూడా చరణ్ సరిగా ఉపయోగించుకోలేకపోతున్నాడు. దీనికి తోడు
ఝాన్సీపై అతను చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన నెగెటివిటీని తీసుకొచ్చాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.