Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌ 10లోకి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇన్‌స్టాలో స్వయంగా క్లారిటీ ఇచ్చిన అందాల తార

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో కంటెస్టెంట్స్ గా ఎవరెవరు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో మాత్రం చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడీ జాబితాలోకి మరో కొత్త పేరు చేరింది. టాలీవుడ్ కు చెందిన ఒక ఫేమస్ హీరోయిన్ ఈసారి హౌస్ లోకి రానుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై స్వయంగా ఆ హీరోయినే క్లారిటీ ఇచ్చింది.

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌ 10లోకి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇన్‌స్టాలో స్వయంగా క్లారిటీ ఇచ్చిన అందాల తార
Bigg Boss Telugu 10

Updated on: Aug 23, 2026 | 1:04 PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంఛింగ్ కోసం బుల్లితెర ఆడియెన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్‌ మొదటి వారంలోనే బిగ్ బాస్ 10 గ్రాండ్ లాంఛింగ్ ఉండనుంది. ఇప్పటికే కామన్ పీపుల్‌కు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం కల్పించేందుకు ‘అగ్నిపరీక్ష’ సీజన్ 2 ను నిర్వహిస్తున్నారు. ఈ కాంటెస్ట్ కు చెందిన వీడియోలు ఇప్పటికే నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరోవైపు సెలబ్రిటీ కంటెస్టెంట్లు ఎవరెవరు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో అయితే చాలా మంది సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. పల్లవి గౌడ, తేజస్విని గౌడ, రాకింగ్ రాకేష్, వర్ష, పవిత్ర, వర్షిణి, నందూస్ వరల్డ్ నందు, చంద్రహాస్, జ్యోతి, రాయల్ ఎంసీ రమణ, హీరో అబ్బాస్, నూకరాజు, టెంపర్ వంశీ.. ఇలా చాలా మంది పేర్లు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పుడీ జాబితాలో మరో పేరు చేరింది. పలు తెలుగు సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటించిన హీరోయిన్ సీరత్ కపూర్ ‘బిగ్ బాస్’ లో అడుగు పెడుతుందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై స్వయంగా సీరత్ కపూరే క్లారిటీ ఇచ్చింది. తాను బిగ్ బాస్ లోకి రావడం లేదని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

‘నేను ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10’ లో అడుగు పెడుతున్నట్టు సోషల్ మీడియాలో పలువురు పోస్టులు చేస్తున్నారు. ఆ ఊహాగానాలను నేను కూడా చూస్తున్నాను. అందుకే ఈ విషయంలో నేను క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను. ప్రస్తుతానికి నేను ‘బిగ్ బాస్’లో పార్టిసిపేట్ చేయడం లేదు. ఒకవేళ ఏదైనా ఉంటే నేనే స్వయంగా అనౌన్స్ చేస్తాను. లేదంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను. దయచేసి అప్పటి వరకు రూమర్లను నమ్మవద్దు’ అని సీరత్ కపూర్ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

సీరత్ కపూర్ పోస్ట్..

కాగా రన్ రాజా రన్ సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది సీరత్ కపూర్. ఆ తర్వాత టైగర్, కొలంబస్, రాజు గారి గది 2, ఒక్క క్షణం, టచ్ చేసి చూడు, కృష్ణ అండ్ హిజ్ లీల, మా వింత గాధ వినుమా, భామా కలాపం, మనమే తదతర సినిమాలతో ఆడియెన్స్ కు బాగా చేరువైందీ అందాల తార. సోషల్ మీడియాలోనూ ఈముద్దుగుమ్మకు మంచి క్రేజ్ ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us