
పై ఫొటోలో ఉన్న అబ్బాయిని గుర్తు పట్టారా? అచ్చం బాలీవుడ్ హీరోలా ఉన్నాడు కదా.. కానీ అతను హీరో కాదు. ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ ఇప్పుడు అతనికి హీరోలకు మించిన క్రేజ్, పాపులారిటీ ఉంది. గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా అతని పేరే వినిపిస్తోంది. సోషల్ మీడియాలో అయితే ఈ పోరగాని గురించే చర్చ జరుగుతోంది. ఇతని సొంతూరు విజయవాడ. మంచిగా చదువుకుని ఐటీ ప్రొఫెషనల్ గా స్థిరపడ్డాడు. అయితే తనకంటూ ఓ గుర్తింపు రావాలనే తలంపుతో ఉద్యోగాన్ని వదిలి పెట్టాడు. హైదరాబాద్ కు వచ్చి మోడల్ గా అదృష్టం పరీక్షించుకున్నాడు. డిజిటల్ కంటెంట్ క్రియేటర్ గా నెట్టింట క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇదే క్రమంలో బిగ్ బాస్ సీజన్ అగ్ని పరీక్ష సీజన్ 2లో పాల్గొన్నాడు. ఆపై కామనర్ కోటాలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోకి అడుగు పెట్టాడు. ఈ పాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్.. పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు ఇటీవలే బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన రోహిత్ అలియాస్ పట్నం రోహిత్ నాయుడు. బిగ్ బాస్ 10లోకి రోహిత్ ఎంట్రీపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో అతని పాత ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
కాగా అగ్ని పరీక్ష సీజన్ 2 లో సత్తా చాటాడు రోహిత్. తనదైన ఆట, మాట తీరుతో జడ్జీలతో పాటు బిగ్ బాస్ ప్రేక్షకుల మనసులు గెల్చుకున్నాడు. ఆపై కామనర్ కోటాలో బిగ్ బాస్ 10 హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అగ్ని పరీక్ష టెంపోనే కొనసాగిస్తూ హౌస్ లో కూడా తన దైన గేమ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు రోహిత్. సెలబ్రిటీల విమర్శలకు మాటలోనే సమాధానమిస్తూ ఫిజికల్ టాస్కులు, గేమ్స్ లో సత్తా చాటాడు. ఓటింగ్ లోనూ టాప్ లో దూసుకెళ్లాడు. రోహిత్ ఆట తీరు చూసి చాలా మంది అతను టాప్-5లో ఉంటాడనుకున్నారు. ఇక అతని అభిమానులైతే టాప్-2లో కూడా ఉండారని కలలు కన్నారు. కానీ అనూహ్యంగా ఎనిమిదో వారంలోనే ఎలిమినేట్ అయిపోయాడు రోహిత్. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రోహిత్ ఆట తీరుతో కొన్ని లోపాలున్నప్పటికీ అతను టాప్ కంటెండర్. అది ఆడియెన్స్ ఓటింగ్ తోనే ప్రూవ్ అయ్యింది. కానీ బిగ్ బాస్ మాత్రం ఇతర హౌస్ మేట్స్ ఓట్లతో రోహిత్ ను ఎలిమినేట్ చేశాడు. ఇది అతని అభిమానులకు ఏ మాత్రం నచ్చలేదు. అయితే బిగ్ బాస్ 10లో రోహిత్ రీఎంట్రీ కచ్చితంగా ఉంటుందని అతని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ విషయంపై అటు బిగ్ బాస్ యాజమాన్యం కానీ రోహిత్ కానీ నోరు మెదపడం లేదు. అయితే రోహిత్ రీఎంట్రీ ఉన్నా లేకున్నా బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో చరిత్రలో ఇతను తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడని కచ్చితంగా చెప్పవచ్చు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి