
బిగ్ బాస్ ఆరో వారం ఎలిమినేషన్ లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. మొదట ఎలిమినేట్ చేస్తున్నట్లు మొదట ప్రకటించి, ఆ తరువాత ఆమెను సర్ప్రైజ్ చేశారు హోస్ట్ నాగార్జున. షాలినినీ ఇంటికి పంపించకుండా సీక్రెట్ రూమ్ లో పెట్టారు. ఇక సోమవారం రావడంతో ఎప్పటిలాగే నామినేషన్ ప్రక్రియ మొదలయ్యింది. కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. ఇకపోతే సోమవారం ఎపిసోడ్ కి సంబంధించి జరిగిన నామినేషన్ ప్రక్రియలో నీతూ వర్సెస్ వర్షిణి, శివ వర్సెస్ రోహిత్ మధ్య రచ్చ ప్రోమోలలో ప్రధానంగా కనిపించింది. మొదట షాలిని కాళ్లు పట్టుకోవడం తనకు నచ్చలేదని ఝాన్సీ ఆర్కే రామకృష్ణను నామినేట్ చేసింది. అసలు ఇది పాయింటే కాదు.. కాళ్లు పట్టుకోవడంలో తప్పే లేదని ఆర్కే ఎదురు తిరిగాడు. ఇక ఝాన్సీ కూడా సింపతి కోసం ట్రై చేస్తోందని.. ఆమెలా నటించి మరీ చూపించాడు . మరోవైపు వర్షిణి టాస్కులు ఆడడం లేదని నీతూ ఫైర్ అయ్యింది. ముఖేష్ ని అడ్డుపెట్టుకొని హౌస్ లో సర్వైవ్ అవుతోంది అంటూ సంచలన కామెంట్స్ చేసింది. అటు వర్షిణి కూడా దమ్ముంటే నాతో తలపడు అంటూ నీతూపై ఎదురు తిరిగింది.
ఇక రోహిత్ సుధీర్ ల మధ్య కూడ మాటల తూటాలు పేలాయి. అలాగే శివ – రోహిత్ మధ్య గొడవ జరిగింది. ఇక షాలిని విషయంలో రోహిత్ , త్రిగుణ్ మధ్య వాగ్వాదం నామినేషన్స్ ప్రక్రియను మరింత హీట్ ఎక్కించింది.ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ గొడవలన్నింటినీ కూడా సీక్రెట్ రూమ్ నుంచి చూస్తూ బాగా ఎంజాయ్ చేసింది షాలిని. ఈ నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత షాలిని తిరిగి మళ్ళీ హౌస్ లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో వినిపిస్తోన్న టాక్ ప్రకారం.. ఈ ఏడవ వారానికి గానూ ఎనిమిది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారని తెలుస్తోంది. రోహిత్, త్రిగుణ్, వర్షిణి, అమన్, వంశీ, నీతూ, దక్షి , రామకృష్ణ నామినేషన్స్ లిస్టులో ఉన్నారని తెలుస్తోంది. ఇవాళ్టి ఎపిసోడ్ తో లేదా రేపటి ఎపిసోడ్ తో దీనిపై పూర్తి క్లారిటీ రావొచ్చు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి