బిగ్ బాస్.. బిగ్ బాస్.. బిగ్ బాస్ మొన్నటివరకు తెలుగులో ఎక్కడ చూసిన ఈ గేమ్ షో గురించే మాట్లాడుకున్నాం. ఎవరు ఎలా ఆడుతున్నారు. ఎవరు విన్ అవుతారు. ఎవరి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఎవరు ఎలిమినేట్ అవుతారు. ఇలా ప్రేక్షకులు ఉత్కంఠతో బిగ్ బాస్ సీజన్ 8 ను చూశారు. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 8 పూర్తయ్యింది. అందరూ ఊహించినట్టే నిఖిల్ విన్నర్ అయ్యాడు. గౌతమ్ రన్నరప్ అయ్యాడు. మనతో పాటే తమిళ్ లోనూ బిగ్ బాస్ సీజన్ 8 జరుగుతుంది. గతంలో కమల్ హాసన్ హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ కు ఇప్పుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హోస్ట్ గా చేస్తున్నారు. ఇక అందరికి తెలిసిందే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ కు టాస్క్ లు ఇస్తారన్న విషయం తెలిసిందే.. అయితే ఈ టాస్క్ లో విన్ అవ్వడం కోసం హౌస్ మేట్స్ చాలా కష్టపడుతూ ఉంటారు. అలాగే టాస్క్ లో విన్ అవ్వడం కోసం ఒకరి పై ఒకరు దాడి కూడా చేసుకుంటుంటారు.
బిగ్ బాస్ తమిళ సీజన్ 8 11వ వారంలో హౌస్ లో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. అయితే హౌస్‌లోని కంటెస్టెంట్ల మధ్య మాటల తగాదాలు ఇప్పుడు ముష్టియుద్ధంగా మారాయి. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంది. గత 7 సీజన్లలో నటుడు కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరించారు. నటుడు విజయ్ సేతుపతి ఈ 8వ సీజన్‌ను హోస్ట్ చేస్తున్నారు. గత అక్టోబరు 6న సీజన్ ప్రారంభమైంది. ఈ సీజన్‌లో చాలా మార్పులు తీసుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే గత 7 సీజన్‌లలో లేనిది ఈ 8వ సీజన్‌లో జరిగింది. బిగ్ బాస్ హౌస్ రెండుటీమ్స్ గా చేశారు.
గడచిన 10 వారాల్లో ఇప్పటి వరకు 11 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోయారు. బిగ్ బాస్ హౌస్‌లో ప్రస్తుతం 13 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. షోకి మరికొన్ని రోజులు మిగిలి ఉండటంతో కంటెస్టెంట్ల మధ్య గొడవలు హీటెక్కుతున్నాయి. రవీందర్ చంద్రశేఖర్, అరుణ్ ప్రసాద్, అన్షిత, దీపక్, దర్శిక, దర్శ గుప్తా, జాక్వెలిన్, ముత్తుకుమార్, జెబ్రి, అర్నవ్, రంజిత్, పవిత్ర జనని, ఆర్జే అనంతి, సచన, సత్య, సునీత, సెలందర్య, వీజే. విశాల్‌తో సహా 18 మంది కంటెస్టెంట్స్‌ని బిగ్ బాస్ హౌస్‌లోకి పంపారు. గత నవంబర్ 3న వైల్డ్ కార్డ్ ఎంట్రీగా మరో 6 మందిని హౌస్‌లోకి పంపారు. కాగా ఈ 11వ వారం బిగ్ బాస్ హౌస్‌లో విశాల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ వారం టాస్క్ మాటల యుద్ధాలకు మించి గ్రౌండ్ బ్రేకింగ్‌కు వెళ్లింది. నిన్న జాఫ్రీ, రణవ్ మధ్య జరిగిన గొడవ కారణంగా రణవ్ చేతిలో కండరాల సమస్య ఏర్పడింది. ఈ నేపథ్యంలో జాక్వెలిన్, పవిత్ర మధ్య కొట్టుకున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.