Bigg Boss 5: ఈసారి బిగ్‌బాస్‌ బజ్‌కు హోస్ట్‌గా వ్యవహరించేంది ఎవరో తెలుసా.? లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన బోల్డ్‌ బ్యూటీ.

Bigg Boss 5: బిగ్‌బాస్‌ రియాలిటీ షో కొత్త సీజన్‌కు సర్వం సిద్ధమైంది. బుల్లి తెర ప్రేక్షకులకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న బిగ్‌బాస్‌ తర్వాత సీజన్‌కు సంబంధించి అధికారిక ప్రకటన రానే వచ్చింది...

Bigg Boss 5: ఈసారి బిగ్‌బాస్‌ బజ్‌కు హోస్ట్‌గా వ్యవహరించేంది ఎవరో తెలుసా.? లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన బోల్డ్‌ బ్యూటీ.
Bigboss Buzz Host

Updated on: Aug 15, 2021 | 7:22 AM

Bigg Boss 5: బిగ్‌బాస్‌ రియాలిటీ షో కొత్త సీజన్‌కు సర్వం సిద్ధమైంది. బుల్లి తెర ప్రేక్షకులకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న బిగ్‌బాస్‌ తర్వాత సీజన్‌కు సంబంధించి అధికారిక ప్రకటన రానే వచ్చింది. 5వ సీజన్‌లో హోస్ట్‌గా నాగార్జున కాకుండా మరో నటుడు కనిపించనున్నాడని పుకార్లు షికార్లు చేసిన విషయం తెలిసిందే. అయితే వీటన్నింటికీ చెక్‌ పెడుతూ తాజాగా బిగ్‌బాస్‌ నిర్వాహకులు ప్రోమోను విడుదల చేశారు. బోర్‌డమ్‌కు చెక్‌ పెడుతూ బిగ్‌బాస్‌ కొత్త సీజన్‌ వచ్చేస్తోందంటూ, ఇందులో కూడా నాగార్జునానే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈసారి షోలో పాల్గొనే వారు వీరేనంటూ రోజుకో పేరు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అయితే నిర్వాహకులు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు.

ఇదిలా ఉంటే షో నిర్వాహకులు మాత్రం చకచక పనులు కానిచ్చేస్తున్నారు. ఇందులో భాగంగానే కంటెస్టెంట్స్‌ను అగష్టు 22న క్వారంటైన్‌కు పంపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రతీసారి బిగ్‌బాస్‌ షో పాటు సమాంతరంగా బిగ్‌బాస్‌ బజ్‌ అనే ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన వారిని ఈ షోలో ఇంటర్వ్యూ చేస్తుంటారు. గత సీజన్‌లో పాల్గొన్న వారిని ఈ షోకు హోస్ట్‌గా నియమిస్తుంటారు. తాజాగా ఈ ఏడాది బిగ్‌బాస్‌ బజ్‌ కార్యక్రమానికి అరియానాను వ్యాఖ్యాతగా తీసుకోనున్నట్లు చర్చ జరుగుతోంది. ఇక గత సీజన్‌లో అరియానా బిగ్‌బాస్‌ హౌజ్‌లో చేసిన సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక అరియానా ఇటీవల సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మతో బోల్డ్‌ ఇంటర్వ్యూతో అరియానా మరోసారి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. మరి ఈసారి బిగ్‌బాస్‌ బజ్‌ కార్యక్రమానికి అరియానా నిజంగానే హోస్ట్‌గా వ్యవహరించనుందా తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

 

Also Read: CM Jagan-Chiranjeevi: ఏపీ సర్కార్ నుంచి మెగాస్టార్ చిరంజీవికి పిలుపు.. ఎందుకంటే..?

Vijay Devarakonda: ఇండియన్ ఐడల్ ఫైనలిస్ట్ షణ్ముక ప్రియకు బంపర్ ఆఫర్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. ఆనందంతో గంతులేసిన సింగర్..

Paagal Movie Review: అమ్మలాంటి ప్రేమ కోసం ‘పాగల్‌’ పాట్లు.. ఇంతకీ లవ్‏లో పాసవుతాడా!

Loading...
Unable to load recommendations.
Follow Us