బిగ్ బాస్ పుణ్యమా అని చాలా మంది ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని చాలా మందిని బిగ్ బాస్ ఆడియన్స్ కు దగ్గర చేసింది. కొంతమందికి సినిమా అవకాశాలు కూడా వచ్చాయి బిగ్ బాస్ గేమ్ షో.. బిగ్ బాస్ వల్ల పాపులారిటీ సొంతం చేసుకున్న వాళ్లలో సయ్యద్ సోహైల్ ఒకరు. ఈ కుర్రాడు బిగ్ బాస్ ద్వారా మంది ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. ఈ గేమ్ షోలో తన దైన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సోహెల్ ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. గతంలో ఒకటి రెండు సినిమాల్లో నటించిన ఈ యంగ్ హీరో ఇప్పుడు మిస్టర్ ప్రగ్నెంట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 18న విడుదల కానుంది . ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు చిత్రయూనిట్. వరుసగా ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయారు.
ఈ సినిమాలో సోహెల్ ప్రెగ్నెంట్ గా కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. మైక్ మూవీస్ బ్యానర్‌లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి మిస్టర్ ప్రెగ్నెంట్ ను నిర్మిస్తున్నారు. రూపా కొడవాయుర్ ఈ సినిమాలో సోహెల్ కు జోడీగా నటిస్తుంది. తాజాగా ఓ కార్యక్రమానికి హాజరయ్యారు సోహెల్. ఈసందర్భంగా సోహెల్ మాట్లాడుతూ.. స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్నాడు.
మిస్టర్ ప్రగ్నెంట్ మూవీ సమయంలో చాలా మంది అవమానించారని ఆవేదన వ్యక్తం చేశాడు. నన్ను చాలా మంది చాలా మాటలు అన్నారు. చిన్న స్క్రీన్ నుంచి వచ్చాడు.. టీవీ షో ద్వారా వచ్చాడు. వీడు హీరో అవుతాడా అని మాటలు అన్నారు. ఒకొక్కసారి ఈ మాటలు వింటుంటే నన్ను ఆడియన్స్ యాక్సప్ట్ చేస్తారా అని భయమేస్తుంది అని అన్నాడు సోహెల్. అలాగే మిస్టర్ ప్రగ్నెంట్ సినిమా సమయంలో నువ్వు తేడా గాడివా.? అంటూ కామెంట్స్ చేశారు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు సోహెల్.