
.అర్జున్ అంబటి.. బుల్లితెర ఆడియెన్స్ కు ఈ నటుడి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పలు సూపర్ హిట్ సీరియల్స్ లో నటించిన ఈ యాక్టర్ సినిమాల్లోనూ తళుక్కుమంటున్నాడు. అర్ధనారి, అశ్వమేథం, పరమసోపానం, సుందరి వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు అర్జున్. ఇక బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ గా కూడా పార్టిసిపేట్ చేశాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ప్రస్తుతం పలు టీవీ షోల్లో పార్టిసిపేట్ చేస్తూ బుల్లితెర ఆడియెన్స్ కు బోలెడంత ఎంటర్ టైన్మెంట్ అందిస్తున్నాడు అర్జున్. సినిమాలు, టీవీ షోస్ సంగతి పక్కన పెడితే.. ఈ నటుడు సురేఖ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉంది. ఈ చిన్నారికి అర్క అని నామకరణం కూడా చేశారు. అయితే కూతురు పుట్టిందన్న విషయాన్ని చెప్పినప్పటికీ ఇప్పటివరకు తన కుమార్తె ఫేస్ ను ఇప్పటివరకు చూపించలేదు అర్జున్ దంపతులు. తాజాగా అర్జున్ భార్య సురేఖ తన కూతురితో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ ఫొటోలు కాస్త వైరల్ అవుతున్నాయి.
అర్జున్ అంబటి- సురేఖ దంపతులు ఇటీవలే ఏడవ వివాహ వార్షికోత్సవం జరుపుకొన్నారు. ఈ శుభదినం సందర్భంగా తమ కుమార్తెను అభిమానులకు పరిచయం చేశారీ లవ్లీ కపుల్. ఇదే క్రమంలో ఒక ఎమోషనల్ నోట్ కూడా షేర్ చేశారు..’ ఏడు సంవత్సరాల క్రితం మేము ఒకరి చేయని ఒకరు పట్టుకొని జీవితాంతం ఇలాగే కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. కష్టసుఖాలలో ఒకరికి ఒకరు తోడుగా నిలిచి ముందుకు నడిచాం. ఇక మా జీవితంలోకి మా కుమార్తె అర్క రావడం అత్యంత మధురమైన క్షణం. ఇద్దరిగా ఉన్న మేము ముగ్గురిగా మారిపోయాం. ఈ ప్రయాణం మాకెంతో ప్రత్యేకం. నాకు భర్తగా నా కుమార్తెకు ప్రేమను పంచే తండ్రిగా ఉన్నందుకు థాంక్యూ.. మనం ఇలాగే జీవితాంతం కలిసి ఉండి మరెన్నో వివాహ వార్షికోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను’అని తమ ఆనందానికి అక్షర రూపమిచ్చారు అర్జున్-సురేఖ దంపతులు.
ప్రస్తుత అర్జున్ దంపతులు షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి.
ఈ పోస్ట్ చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే కూతురు అర్క కూడా చాలా క్యూట్ గా ఉందంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.