బిగ్ బాస్ నిన్నటియూ ఎపిసోడ్ లో స్పిన్ ది బాటిల్ టాస్క్ తర్వాత హౌస్ మేట్స్‌ను ఏడిపించేశాడు బిగ్ బాస్. హౌస్ మేట్స్ లో 5 గురికి తమ ఇళ్లనుంచి స్పెషల్ గిఫ్ట్స్ ను పంపించాడు. ఇద్దరిని సెలక్ట్ చేసుకొని మిగిలిన వారికి లాలీ పప్స్ ఇచ్చి అవి ఆ ఇద్దరిలో ఎవరికీ ఎక్కువ ఇస్తారో వారి గిఫ్ట్ ఉంటుందని మరొకరి గిఫ్ట్ తిరిగి వెళ్ళిపోతుందని చెప్పాడు. బిగ్ బాస్ లా చెప్పగానే హౌస్ మేట్స్ ఏడవడం మొదలు పెట్టారు. ముందుగా అభయ్, నిఖిల్‌ను సెలక్ట్ చేశాడు బిగ్ బాస్. అభయ్ కు తన తండ్రి వాచ్ ను అలాగే నిఖిల్ కు తన తండ్రి షర్ట్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇక అభయ్, నిఖిల్ కు మిగిలిన హౌస్ మేట్స్ ఎన్ని లాలీ పప్స్ ఇస్తారో దాన్ని బట్టి ఆ ఎవరి గిఫ్ట్ ఉంచాలో ఎవరి గిఫ్ట్ పంపించాలో నిర్ణయిస్తాడు. దాంతో ముందుగా అభయ్ మాట్లాడుతూ..
అది మా నాన్న వాచ్. మా నాన్న నా లైఫ్ లో ఒకే ఒక్కసారి హగ్ చేసుకున్నాడు. ఆయన మేథ్స్ టీచర్.. చాలా స్ట్రిక్ట్. కానీ సినిమాల్లోకి వెళ్తా అంటే నన్ను ఎంకరేజ్ చేసింది నాన్నే. నేను సంపాదించి మా నాన్నకు కొన్న మొదటి గిఫ్ట్ అది. ఆయన ఉన్నంతకాలం అదే పెట్టుకున్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు అభయ్. ఆతర్వాత నిఖిల్ మాట్లాడుతూ..
అది మా నాన్న షర్ట్.. నేను ఊర్లో కంటే ఎక్కువగా బయటే ఉంటా.. అందుకే ఆయన షర్ట్ ను నాతో ఉంచుకుంటా.. బేసిక్‌గా నాన్నతో అబ్బాయిలకి అంత చూపించే బాండింగ్ ఉండదు. ఆయనకు హగ్ కూడా ఇవ్వలేం.. అందుకే ఆయన షర్ట్ దొంగతనంగా తెచ్చుకున్న.. అది వేసుకుంటే మా నాన్నను హగ్ చేసుకున్నట్టు ఉంటుంది అని ఎమోషనల్ అయ్యాడు నిఖిల్. ఆతర్వాత ఒకొక్కరు అభయ్, నిఖిల్ కు లాలీ పప్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. ఎక్కువ లాలి పాప్‌లు అభయ్‌కి ఇచ్చారు సభ్యులు. దాంతో అభయ్ కు గిఫ్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. నిఖిల్ గిఫ్ట్ ను తిరిగి పంపించేశాడు. ఆతర్వాత నిఖిల్ దగ్గర సోనియా కాస్త ఎమోషనల్ అయింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.