Bigg Boss 8 Telugu : పృథ్వీకి టైట్ హగ్ ఇచ్చిన విష్ణు ప్రియా.. కౌంటర్ వేసిన అవినాష్

|

Oct 10, 2024 | 9:06 AM

అబ్బాయిలు అమ్మాయిలను సపరేట్ టీమ్స్ గా చేశాడు బిగ్ బాస్. అలాగే నవ్వకుండా ఉండాలని ఓ టాస్క్ ఇచ్చి నోట్లో నీళ్లు పోసుకొని ఉంటె అపోజిట్ టీమ్ వచ్చి నవ్విస్తారు. నవ్వినా వారు అవుట్ అని చెప్పాడు. అయితే అవినాష్ నవ్వించాడని ట్రై చేస్తే గౌతమ్ తెగ ఫీల్ అయ్యి ఏడ్చేసాడు.

Bigg Boss 8 Telugu : పృథ్వీకి టైట్ హగ్ ఇచ్చిన విష్ణు ప్రియా.. కౌంటర్ వేసిన అవినాష్
Bigg Boss 8.
Follow us on

బిగ్ బాస్ సీజన్ 8 లోకి కొత్త హౌస్ మేట్స్ రావడంతో హౌస్ మొత్తం కళకళలాడుతోంది. నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ కు ఫన్నీ టాస్క్ లు ఇచ్చాడు బిగ్ బాస్. అబ్బాయిలు అమ్మాయిలను సపరేట్ టీమ్స్ గా చేశాడు బిగ్ బాస్. అలాగే నవ్వకుండా ఉండాలని ఓ టాస్క్ ఇచ్చి నోట్లో నీళ్లు పోసుకొని ఉంటె అపోజిట్ టీమ్ వచ్చి నవ్విస్తారు. నవ్వినా వారు అవుట్ అని చెప్పాడు. అయితే అవినాష్ నవ్వించాడని ట్రై చేస్తే గౌతమ్ తెగ ఫీల్ అయ్యి ఏడ్చేసాడు. ఏకంగా మైక్ విసిరికొట్టి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఆతర్వాత హౌస్ మేట్స్ అందరూ కలిసి వెళ్లి అతన్ని ఓదార్చారు. ఆతర్వాత పక్కకు వెళ్లి ఒక్కడే ఏడ్చాడు గౌతమ్. ఎవరో ఏదో అన్నారని నువ్వు ఫీల్ కాకురా.. నాన్న ఐయామ్ సారీ.. మాట్లాడకుండా వచ్చినా గొడవపడి.. మిమ్మల్ని గర్వపడేలా చేస్తా ఈసారి.. కప్పు ఖచ్చితంగా కొడతా.. అని కన్నీళ్లు పెట్టుకున్నాడు గౌతమ్.

ఆతర్వాత బిగ్ బాస్ హౌస్ లో ఫన్ కంటిన్యూ అయ్యింది. అవినాష్, రోహిణి మొగుడు పిల్లలు ఇంట్లో ఎలా ఉంటారో చేసి చూపించారు. దాంతో హౌస్ మేట్స్ అంతా తెగనవ్వేశారు. ఆతర్వాత విష్ణు ప్రియా పృథ్వీ ప్రేమ కథ మొదలైంది. నెక్స్ట్ డే ఉదయం అందరూ ఉదయాన్నే ఎనర్జిటిక్‌గా డ్యాన్స్ వేశారు. తర్వాత గిన్నెలు తోముతూ కనిపించింది విష్ణు. అయితే గిన్నెలు తోముతుంటే.. వేలు కట్ అయిందంటూ విష్ణు కాస్త హంగామా చేసింది. ఆ కట్ అయిన వేలును పృథ్వీకి చూపించింది.. పృథ్వీ తెగ ప్రేమ చూపించాడు.

మనోడు వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేస్తా అంటూ తన ప్రేమ కురిపించాడు. గౌతమ్ తో కలిసి విష్ణు కు ఫస్ట్ ఎయిడ్ చేశారు. దీంతో వెంటనే పృథ్వీకి ఓ టైట్ హగ్ ఇచ్చింది విష్ణు ప్రియా. అంతో పృథ్వీ తెగ సంబరపడ్డాడు. ఇక ఇది చూసి నువ్వు ఫస్ట్ ఎయిడ్ చేయక్కర్లేదు పృథ్వీ పట్టుకోగానే తగ్గిపోయి ఉంటుంది.. అంటూ కౌంటర్లు వేశాడు అవినాష్ మొత్తానికి విష్ణు,పృథ్వీ ప్రేమకథ చిత్రం అలా నడిచింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.