AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బాస్ ఇంట్లో నాలుగో వారం.. తొలిరోజే హీటెక్కిన గొడవలు.. గాయాలతో ముగిసిన టాస్క్!

బిగ్ బాస్ తెలుగు సీజన్‌లో ఆదివారం ఎపిసోడ్ అనూహ్య మలుపులతో సాగింది. ఒకవైపు మిథిలేష్ ఎలిమినేషన్‌పై ఇంటి సభ్యుల మధ్య తీవ్ర చర్చ జరగగా.. మరోవైపు చివరి నిమిషంలో ముఖేష్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దాంతో అపూర్వ కెప్టెన్ అయింది.

బిగ్ బాస్ ఇంట్లో నాలుగో వారం.. తొలిరోజే హీటెక్కిన గొడవలు.. గాయాలతో ముగిసిన టాస్క్!
Biggboos 10
Rajeev Rayala
|

Updated on: Sep 29, 2026 | 7:53 AM

Share

బిగ్ బాస్ ఇంట్లో నాలుగో వారం మొదలైన రోజే పరిస్థితులు పూర్తిగా వేడెక్కిపోయాయి. సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ల మధ్య జరిగిన గొడవలు, మాటల యుద్ధాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా అపూర్వ–షాలినీ, రోహిత్–త్రిగుణ్, అమన్–షాలినీ మధ్య జరిగిన వాగ్వాదాలు హౌస్‌లో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించాయి. మరోవైపు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లో ఇద్దరు కంటెస్టెంట్లు గాయపడటంతో ఆట మధ్యలోనే నిలిచిపోయిన పరిస్థితి కనిపించింది. నాలుగో వారం కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన అపూర్వకు తొలిరోజే ఇబ్బందులు ఎదురయ్యాయి. డిష్ వాషింగ్ విషయంలో, అలాగే కెప్టెన్ రూమ్ ఖాళీ చేయాలనే అంశంలో అపూర్వకు, ముఖేష్‌కు మధ్య మాటల యుద్ధం మొదలైంది. తన నిర్ణయాలను అందరూ పాటించాలంటే ముందుగా అందరితో కలిసి మీటింగ్ పెట్టాలని ముఖేష్ చెప్పడంతో అపూర్వ వెంటనే సమావేశం ఏర్పాటు చేసింది. అయితే అక్కడ కూడా ఇద్దరి మధ్య వాదన కొనసాగింది. కెప్టెన్‌గా తనను గౌరవించడం లేదని అపూర్వ అసహనం వ్యక్తం చేసింది.

అంతేకాకుండా కెప్టెన్‌ను పేరుతో కాకుండా ‘కెప్టెన్ అపూర్వ’ అని పిలవాలని ఆమె సూచించింది. అయితే ఈ విషయంలో త్రిగుణ్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. తాను అలా పిలవనని త్రిగుణ్ స్పష్టం చేయడంతో ఇద్దరి మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది. అపూర్వ వ్యవహారశైలిపై షాలినీ రోహిత్‌తో మాట్లాడటం కూడా ఇంట్లో కొత్త చర్చకు దారితీసింది. తనను కావాలనే తప్పుగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని షాలినీ అభిప్రాయపడింది. ఇదే సమయంలో త్రిగుణ్, దేబ్జానీ మధ్య జరిగిన సంభాషణలో మిథిలేష్ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. కొద్దిరోజులే ఇంట్లో ఉన్నప్పటికీ భారీ మొత్తంతో బయటకు వెళ్లిన విషయాన్ని వారు చర్చించుకున్నారు.

మరోవైపు అర్ధరాత్రి సమయంలో త్రిగుణ్ కెప్టెన్ రూమ్ నుంచి కొన్ని డ్రింక్స్ తీసుకోవడం కూడా హౌస్‌లో ఆసక్తికర పరిణామంగా మారింది. ఇక అసలు ఆటను ప్రారంభిస్తూ బిగ్ బాస్ ‘టోటల్ డామినేషన్’ టాస్క్‌ను ప్రకటించాడు. కంటెస్టెంట్లను రెండు టీమ్‌లుగా విభజించాడు. షాలినీ, శ్రిష్టి, చరణ్, నరేష్, త్రిగుణ్, ముఖేష్, దేబ్జానీ సభ్యులుగా ఉన్న టీమ్‌కు సప్తశక్తిగా పేరు పెట్టగా, మిగిలిన కంటెస్టెంట్లు మరో జట్టుగా ఏర్పడ్డారు. తమ టీమ్‌కు ‘భైరవ’ అనే పేరు పెట్టుకున్నారు. తొలి యుద్ధంలో ఆధిపత్యం సాధించిన టీమ్‌కు ప్రత్యేకమైన ప్రయోజనం ఉంటుందని బిగ్ బాస్ ప్రకటించాడు. మొదటి ఆయుధంగా డ్యాగర్స్‌ను ప్రవేశపెట్టిన బిగ్ బాస్.. ఒక కంటెస్టెంట్ రెండు లేదా అంతకంటే ఎక్కువ డ్యాగర్స్ సంపాదించుకుంటే ప్రత్యర్థి టీమ్ ఆటను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని వెల్లడించాడు.

టాస్క్‌లో భాగంగా రోహిత్, సుధీర్, రామ్ ప్రసాద్ కలిసి నరేష్‌ను సరదాగా ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అతని వద్ద ఉన్న డ్యాగర్‌ను తీసుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా సీరియస్‌గా మారింది. తన డ్యాగర్‌ను తీసుకున్న విధానంపై నరేష్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మరోవైపు ఈ ఘటనకు ప్రతిస్పందనగా ప్రత్యర్థి టీమ్ సభ్యులు కూడా ఝాన్సీని టార్గెట్ చేయడంతో ఇంట్లో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది.తర్వాత బిగ్ బాస్ మూడు దశల్లో రథాన్ని నిర్మించే టాస్క్‌ను ఇచ్చాడు. ఇందుకోసం ఇంటి సభ్యులు బ్రిక్స్‌ను సేకరించాల్సి ఉంటుంది. ఎక్కువ బ్రిక్స్ సంపాదించిన టీమ్‌కు రథంలోని కీలక భాగాలను పొందే అవకాశం ఉంటుందని బిగ్ బాస్ వివరించాడు. ఈ టాస్క్‌కు రోహిత్, షాలినీని సంచాలకులుగా నియమించారు. అయితే వారు సంచాలకులుగా వ్యవహరిస్తూనే ఆటలో కూడా పాల్గొనే అవకాశం ఉంటుందని బిగ్ బాస్ చెప్పడంతో కొత్త చర్చ మొదలైంది.

రూల్స్‌పై రోహిత్, షాలినీ మాట్లాడుతున్న సమయంలో అపూర్వ అక్కడికి వచ్చి మాట్లాడేందుకు ప్రయత్నించింది. అయితే షాలినీ ఆమెను అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య మరోసారి గొడవ మొదలైంది. ప్రతిసారీ తాను మాట్లాడుతున్న సమయంలో అపూర్వ మధ్యలోకి వస్తోందంటూ షాలినీ ఆగ్రహం వ్యక్తం చేసింది. టాస్క్ కొనసాగుతున్న సమయంలో శ్రిష్టి కాలికి గాయం కావడంతో ఆటను తాత్కాలికంగా నిలిపివేశారు. మెడికల్ రూమ్‌కు వెళ్లే ముందు తన వద్ద ఉన్న డ్యాగర్‌ను శ్రిష్టి షాలినీకి అప్పగించింది. అయితే ఈ విషయాన్ని గమనించిన అపూర్వ తన టీమ్ సభ్యులను పిలిచి షాలినీ వద్ద డ్యాగర్ ఉందని చెప్పింది. దీంతో రోహిత్, సుధీర్, ఝాన్సీ, అమన్ తదితరులు షాలినీ నుంచి డ్యాగర్ తీసుకునేందుకు ప్రయత్నించారు. ఇది చూసిన మరో టీమ్ సభ్యులు అడ్డుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. శ్రిష్టి మెడికల్ రూమ్‌లో ఉన్న సమయంలో ఆమె డ్యాగర్‌ను తీసుకోవడం సరికాదని వారు వాదించారు. ఈ ఘటనపై త్రిగుణ్, రోహిత్ మధ్య కూడా తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. ఇరువైపుల నుంచి ఘాటైన వ్యాఖ్యలు రావడంతో బిగ్ బాస్ హౌస్‌లో వాతావరణం పూర్తిగా వేడెక్కిపోయింది. తర్వాత టాస్క్ తిరిగి ప్రారంభమైన సమయంలో ముఖేష్ కాలికి గాయం కావడంతో మరోసారి ఆట ఆగింది. అమన్ ఫౌల్ గేమ్ ఆడాడని షాలినీ ఆరోపించడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

అమన్ తన వాదనను వినిపించగా, షాలినీ కూడా వెనక్కి తగ్గలేదు. దీంతో ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. రోజంతా వరుసగా గొడవలు జరగడంతో హౌస్‌లోని కంటెస్టెంట్ల మధ్య విభేదాలు మరింత స్పష్టంగా కనిపించాయి. ఎన్ని గొడవలు, వివాదాలు జరిగినప్పటికీ చివరికి టాస్క్‌లో టీమ్ భైరవ ఆధిపత్యం సాధించింది. దీంతో రథ నిర్మాణంలో తొలి భాగాన్ని అమర్చే అవకాశం ఆ టీమ్‌కు దక్కింది. అలా నాలుగో వారం తొలి రోజే గొడవలు, గాయాలు, వ్యూహాలు, ఆధిపత్య పోరుతో ఎపిసోడ్ ఆసక్తికరంగా ముగిసింది. ఇక రాబోయే ఎపిసోడ్‌లో నామినేషన్స్ ప్రక్రియ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో నాలుగో వారం హౌస్‌లో మరింత రచ్చ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తొలిరోజే హీటెక్కిన గొడవలు.. గాయాలతో ముగిసిన టాస్క్
తొలిరోజే హీటెక్కిన గొడవలు.. గాయాలతో ముగిసిన టాస్క్
బ్లడ్ షుగర్,అరికాళ్ల మంటలకు చెక్ పెట్టే అమృతం! మెంతుల కాంబినేషన్
బ్లడ్ షుగర్,అరికాళ్ల మంటలకు చెక్ పెట్టే అమృతం! మెంతుల కాంబినేషన్
చెడ్డీగ్యాంగ్‌ కలకలం.. అపార్ట్‌మెంట్, విల్లా కమిటీలకు కీలక సూచనలు
చెడ్డీగ్యాంగ్‌ కలకలం.. అపార్ట్‌మెంట్, విల్లా కమిటీలకు కీలక సూచనలు
రెస్టారెంట్ స్టైల్‌లో దమ్ బిర్యానీ.. ఇంట్లో ఎలా చేయాలంటే?
రెస్టారెంట్ స్టైల్‌లో దమ్ బిర్యానీ.. ఇంట్లో ఎలా చేయాలంటే?
మీరు GST చెల్లించకపోతే మీ వ్యాపారం వెంటనే మూసివేస్తారా?
మీరు GST చెల్లించకపోతే మీ వ్యాపారం వెంటనే మూసివేస్తారా?
గర్భసంచిని క్లీన్ చేసే దివ్యౌషధం..నెలసరి నొప్పులకు చెక్!
గర్భసంచిని క్లీన్ చేసే దివ్యౌషధం..నెలసరి నొప్పులకు చెక్!
ఓటటీలో వణుకు పుట్టిస్తోన్నరియల్ స్టోరీ.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటటీలో వణుకు పుట్టిస్తోన్నరియల్ స్టోరీ.. తెలుగులోనూ చూడొచ్చు
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..?
4 సమస్యలకు ఒకే ఔషదం.. వెల్లుల్లిని ఇలా వాడితేనే వరం
4 సమస్యలకు ఒకే ఔషదం.. వెల్లుల్లిని ఇలా వాడితేనే వరం
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. బంగారం ధరలు రికార్డు స్థాయిలో పతనం..
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. బంగారం ధరలు రికార్డు స్థాయిలో పతనం..