Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. కెప్టెన్సీ మారింది.. ఓటింగ్‌లో దూసుకెళ్తున్న త్రిగుణ్

బిగ్ బాస్ తెలుగు 10లో నాలుగో వారం కెప్టెన్సీ విషయంలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. వర్షిణి ప్రత్యేక పవర్‌తో కెప్టెన్‌గా మారగా, ఓటింగ్‌లో త్రిగుణ్ దూసుకెళ్తున్నాడు. అమన్ ఎలిమినేషన్ డేంజర్‌లో ఉన్నాడా.? ఈవారం ఏకంగా తొమ్మిది మంది నామినేషన్స్ లో ఉన్నారు.

Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. కెప్టెన్సీ మారింది.. ఓటింగ్‌లో దూసుకెళ్తున్న త్రిగుణ్
Biggboss 10

Updated on: Oct 03, 2026 | 8:01 AM

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ప్రారంభం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. గత సీజన్లకు భిన్నంగా ఈసారి గేమ్‌ను కొత్త రూల్స్, అనూహ్యమైన ట్విస్టులతో నడిపించనున్నట్లు మేకర్స్ ముందుగానే ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే ప్రతి వారం హౌస్‌లో కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కెప్టెన్సీ విషయంలో జరిగిన ట్విస్ట్‌తో పాటు నాలుగో వారం ఓటింగ్ ట్రెండ్స్ కూడా ఆసక్తికరంగా మారాయి. నాలుగో వారానికి సంబంధించిన కెప్టెన్సీ పోటీ ముగిసే సమయానికి అమన్ విజేతగా నిలిచాడు. దీంతో అతడే హౌస్‌కు కెప్టెన్ అవుతాడని మిగతా కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులు కూడా భావించారు. టాస్క్ గెలిచిన ఆనందంలో అమన్ తన విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. కెప్టెన్సీ టాస్క్ పూర్తయిన తర్వాత బిగ్ బాస్ హౌస్‌లోకి ఓ ప్రత్యేకమైన ‘మ్యాజిక్ కీ’ని పంపించాడు. ఈ కీకి వర్షిణికి సంబంధించిన ప్రత్యేక పవర్ లింక్ అయి ఉండటం ఆసక్తిని కలిగించింది.

300లకు పైగా సినిమాలు.. తొలి సినిమాకే రూ. 15 రెమ్యునరేషన్.. ఈ హీరోయిన్ రేంజే వేరు

మ్యాజిక్ కీని ఉపయోగించడం ద్వారా వర్షిణి తనకు లభించిన ప్రత్యేక అధికారాన్ని యాక్టివేట్ చేసుకుంది. ఈ పవర్ ద్వారా టాస్క్‌లో విజయం సాధించిన కంటెస్టెంట్‌కు దక్కాల్సిన కెప్టెన్సీ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం లభించింది. దీంతో అమన్ గెలిచిన కెప్టెన్సీ అవకాశాన్ని వర్షిణి తనకు దక్కించుకుంది. ఫలితంగా నాలుగో వారం బిగ్ బాస్ హౌస్‌కు కెప్టెన్‌గా వర్షిణి బాధ్యతలు చేపట్టింది. అమన్ టాస్క్ గెలిచినప్పటికీ చివరికి కెప్టెన్ కాలేకపోవడం హౌస్‌లోనే కాకుండా ప్రేక్షకుల్లోనూ చర్చనీయాంశంగా మారింది. బిగ్ బాస్ ఈ సీజన్‌లో తీసుకొస్తున్న కొత్త తరహా ట్విస్టులకు ఇది మరో ఉదాహరణగా నిలిచింది.

కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్స్ ఈ భామలు..! ఒకప్పుడు ఊపేశారు.. కానీ ఆతర్వాత సినిమాలు ఆపేశారు

ఇక నాలుగో వారం ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ఉత్కంఠగా సాగుతోంది. ఈ వారం మొత్తం తొమ్మిది మంది కంటెస్టెంట్లు నామినేషన్‌లో ఉన్నారు. త్రిగుణ్, రోహిత్, ముఖేష్, శాలిని, చరణ్, సృష్టి, నరేష్, దేబ్జానీ, అమన్‌లు ఈ వారం ఎలిమినేషన్ రేసులో ఉన్నారు. వీరిలో ఎవరు సేవ్ అవుతారు? ఎవరు హౌస్‌ను వీడాల్సి వస్తుంది? అనే అంశంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఓటింగ్ ట్రెండ్స్‌ను పరిశీలిస్తే ఈ వారం పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. మొదట్లో సృష్టి డేంజర్ జోన్‌లో ఉన్నట్లు ట్రెండ్స్‌లో కనిపించగా, ఆ తర్వాత దేబ్జానీ ఓటింగ్ పరంగా వెనుకబడినట్లు వార్తలు వచ్చాయి. తాజా ట్రెండ్స్‌లో మాత్రం అమన్ చివరి స్థానానికి పడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో గతంలో కెప్టెన్సీ కోసం పోటీ పడిన అమన్‌కు ఇప్పుడు ఎలిమినేషన్ ముప్పు ఎదురవుతుందా.? అనే చర్చ మొదలైంది. అధికారిక ఓటింగ్ ఫలితాలు వచ్చే వరకు పరిస్థితి మారే అవకాశం ఉంటుంది. మరోవైపు త్రిగుణ్ మాత్రం ఓటింగ్‌లో దూసుకుపోతున్నాడు. మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే అతడి ఓటింగ్ శాతం ఎక్కువగా కనిపిస్తోంది. రోహిత్, అమన్, అపూర్వ నుంచి త్రిగుణ్‌పై వచ్చిన విమర్శలు, గేమ్‌లో అతడిని టార్గెట్ చేసిన సందర్భాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. దాని ప్రభావం ఓటింగ్‌పై పడిందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు కెప్టెన్సీ విషయంలో వర్షిణి అనూహ్యంగా పవర్ ఉపయోగించి కెప్టెన్‌గా మారడం, మరోవైపు ఓటింగ్‌లో అమన్ వెనుకబడటం, త్రిగుణ్ మాత్రం భారీ ఓటింగ్ తో ముందుకు సాగుతున్నట్లు కనిపించడం.. నాలుగో వారం బిగ్ బాస్ తెలుగు 10ను మరింత ఆసక్తికరంగా మార్చాయి. చివరి వరకు ఓటింగ్ ట్రెండ్స్ మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తి నెలకొంది.

ఫస్ట్ సినిమాకు రూ. 70లక్షలు అందుకుంది.. దెబ్బకు రెండు సినిమాలకే కనిపించకుండా పోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us