బిగ్ బాస్ ఇంట్లో ట్విస్టుల మీద ట్విస్టులు.. అపూర్వ ఎంట్రీతో షాలినీ ముఖం మారిపోయిందే

బిగ్ బాస్ ఇంట్లో మూడో వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్కులు ఆసక్తికరంగా సాగుతున్నాయి. కంటెస్టెంట్ల మధ్య పోటీ, గొడవలు, భావోద్వేగాలు ఒకవైపు కొనసాగుతుండగా.. మరోవైపు ఇంటి సభ్యుల ఆటతీరుపై బయట ప్రేక్షకుల్లో ఉన్న అభిప్రాయాలను బిగ్ బాస్ స్క్రీన్‌పై చూపించడం హాట్ టాపిక్‌గా మారింది.

బిగ్ బాస్ ఇంట్లో ట్విస్టుల మీద ట్విస్టులు.. అపూర్వ ఎంట్రీతో షాలినీ ముఖం మారిపోయిందే
Biggboss 10

Updated on: Sep 26, 2026 | 7:24 AM

బిగ్ బాస్ హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టమే. ఒకరిని ఇంట్లోకి తీసుకురావాలని కంటెస్టెంట్లు అనుకోకపోయినా.. అదే వ్యక్తిని బిగ్ బాస్ అనూహ్యంగా హౌస్‌లోకి తీసుకొస్తే పరిస్థితులు ఎలా మారతాయో తాజా ఎపిసోడ్‌లో చూస్తే అర్ధమవుతుంది. ముఖ్యంగా అపూర్వ ఎంట్రీతో ఇంటి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత జరిగిన టాస్కులు, వాదనలు, కెప్టెన్సీ పోటీ.. ఇలా ఎపిసోడ్ మొత్తం ఆసక్తికరంగా సాగింది. కంటెస్టెంట్ల ఓటింగ్‌లో తక్కువ ఓట్లు రావడంతో అపూర్వ ఇంట్లోకి రాకపోవచ్చని అనుకున్న సమయంలో బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. మీ అందరికీ టెన్షన్ ఇవ్వడానికే అపూర్వను తీసుకొస్తున్నాను అంటూ ఆమెను హౌస్‌లోకి పంపించాడు. అపూర్వ ఇంట్లోకి వచ్చిన వెంటనే ముఖేష్, రోహిత్‌తో డ్యాన్స్ చేయించాడు. రోహిత్, అపూర్వ కలిసి స్టెప్పులు వేస్తుండగా షాలినీ కిచెన్ నుంచి వారిని గమనించింది. మరోవైపు శ్రిష్టి, షాలినీ ఇద్దరూ సుధీర్‌ గురించి డిస్కషన్ పెట్టారు.

సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

ఇదిలా ఉంటే అపూర్వ సెలబ్రిటీ గ్యాంగ్‌తో కలిసి భోజనం చేయగా.. మరోవైపు అగ్ని పరీక్ష టీమ్ సభ్యులు కూడా కలిసి కూర్చుని తింటూ కనిపించారు. అపూర్వకు, నీకు ఏదో సమస్య ఉన్నట్టుగా ఇంట్లో కొందరు మాట్లాడుకుంటున్నారని రోహిత్.. షాలినీతో మాట్లాడాడు. తాను అపూర్వతో మాట్లాడేందుకు ప్రయత్నించినా ఆమె రియాక్ట్ అవ్వలేదని షాలినీ చెప్పింది. ముఖేష్ అయితే అపూర్వ ఇంట్లోకి రావొద్దంటూ కెమెరాల ముందే మాట్లాడాడని ఆమె గుర్తు చేసింది. అయితే ఇప్పుడు ఆమె ఇంట్లోకి వచ్చిన తర్వాత అతని ప్రవర్తన మరోలా ఉందని చెప్పింది. అదే సమయంలో త్రిగుణ్ కూడా అక్కడికి వచ్చి.. అసలు షాలినీ, అపూర్వ మధ్య ఏమైనా సమస్య ఉందా అని అడిగాడు. తనకు ఎలాంటి సమస్య లేదని షాలినీ స్పష్టం చేసింది.

16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..! అప్పుడు తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి

మరోవైపు నరేష్ నిద్రపోవడాన్ని బిగ్ బాస్ గమనించాడు. దీంతో అతడికి పనిష్మెంట్ విధించారు. ఈ శిక్షలో భాగంగా ఝాన్సీ చెప్పడంతో గుంజీలు తీశాడు నరేష్. ఇక హౌస్‌లో మరో ఆసక్తికరమైన పోటీ జరిగింది. మిథిలేష్, రామకృష్ణలకు సమానమైన ఓట్లు రావడంతో.. ఇద్దరిలో ఎవరు ఇంట్లోకి అడుగుపెట్టాలో నిర్ణయించేందుకు బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. ఇద్దరికీ టైర్లకు సంబంధించిన టాస్క్ నిర్వహించగా.. మిథిలేష్, రామకృష్ణ మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. చివరికి మిథిలేష్ పైచేయి సాధించి బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇంటి పనుల విషయంలో త్రిగుణ్, అమన్ మధ్య చిన్న వివాదం మొదలై అది కాస్త పెద్దదైంది. కెప్టెన్ చెబితే తాను వింటానని, ప్రతి ఒక్కరూ చెప్పిన మాట వినాల్సిన అవసరం లేదని అమన్ చెప్పడంతో త్రిగుణ్ అసహనం వ్యక్తం చేశాడు. తర్వాత షాలినీతో త్రిగుణ్ మాట్లాడుతున్న సమయంలో రోహిత్ ముందుకు రావడంతో.. తన ముందు రుబాబ్ చూపించవద్దంటూ త్రిగుణ్ హెచ్చరించాడు. అయితే చివరికి అమన్ వద్దకు వెళ్లిన త్రిగుణ్.. తాను కావాలని అలా మాట్లాడలేదని, ఒత్తిడిలో ఉండి అలా మాట్లాడి ఉంటానని చెప్పి సారీ చెప్పాడు. హమ్మయ్య అనుకునేలోగా  ఎగ్స్ విషయంలో కూడా అపూర్వ, రోహిత్ మధ్య మాటల యుద్ధం జరిగింది. అపూర్వ ఎగ్స్ తినదు కదా.. వాటిని తమకు ఇస్తే ఏంటి అని రోహిత్ అడిగాడు. అందుకు తనకు దాని వల్ల ఏం ప్రయోజనం వస్తుందని అపూర్వ ప్రశ్నించింది. దానికి బదులుగా నామినేషన్ సమయంలో ఎదుటివారు ఫేవర్ చేసే అవకాశం ఉంటుందని రోహిత్ చెప్పడంతో.. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఇవి కూడా చదవండి

స్టార్ హీరోలు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా 460 రోజులు థియేటర్లలో హౌస్‌ఫుల్.!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us