AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9 Telugu: బ్లాస్లింగ్ న్యూస్.. బిగ్ బాస్ సీజన్ 9లోకి భోలే అన్న.. !

మాటలు.. ఆ పాటలు.. పద ప్రయోగాల్లో దిట్ట అయిన భోలే షావలి మళ్లీ బిగ్ బాస్ 9లోకి కూడా ఎంట్రీ ఇచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఫోక్ సింగర్‌గా.. మ్యూజిక్ డైరెక్టర్‌గా.. అనేక సినిమాల్లో పాటలు పాడటమే కాకుండా పలు ప్రవేట్ సాంగ్స్ కంపోజ్ చేసి తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు భోలే షావలి సన్నాఫ్ యాకుబలి.

Bigg Boss 9 Telugu: బ్లాస్లింగ్ న్యూస్.. బిగ్ బాస్ సీజన్ 9లోకి భోలే అన్న.. !
Bhole Shavali
Ram Naramaneni
|

Updated on: Jul 25, 2025 | 4:45 PM

Share

 భోలే షావలి..  బిగ్ బాస్ సీజన్ 8కు వచ్చేవరకు ఈయన పేరు చాలామందికి తెలీదు. బోలెడంత టాలెంట్ ఉన్నప్పటికీ మరుగున పడిపోయాడు ఈ సింగర్ కమ్ కంపోజర్. భోలే షావలి సన్నాఫ్ యాకుబలి.. అంటూ పాటబిడ్డగా బిగ్ బాస్ 7లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన భోలే.. అనతికాలంలో తన మార్క్ వేశాడు. టాస్కుల్లో పెద్దగా సత్తా చూపలేకపోయినా.. తన టాలెంట్‌ను ప్రదర్శించడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. మాటలు.. ఆ పాటలు..  పద ప్రయోగాలతో తనకంటూ ఫ్యాన్స్‌ను సెట్ చేసుకున్నాడు. సందర్భానికి తగ్గట్లు ట్యూన్ కట్టి అప్పటికప్పుడే పాటలు పాడటం.. తన మార్క్ పంచ్‌లతో రంజింపజేశాడు. అంతేనా.. కన్నడ సీరియల్ బ్యాచ్‌కు చాలా నిద్రలేని రాత్రుళ్లు మిగిల్చాడు. ఆ సమయంలో భోలే సోషల్ మీడియా మీమర్స్‌కు ఇచ్చిన కంటెంట్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాడు. అనూహ్య పరిస్థితుల్లో ఆ సీజన్‌లో పదోవారంలో ఎలిమినేట్ అయ్యాడు. ఇది అప్పట్లో షాకింగ్ ఎలిమినేషన్.

దీంతో భోలే క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకున్న బిగ్ బాస్ మేనేజ్‌మెంట్ అతనికి మరో అవకాశం కల్పించడానికి రెడీ అయినట్లు సమాచారం. అతను సీజన్ 9లోకి తీసుకొచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయట. మరి ఈ టాక్స్ ఎంతమేర నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఇక భోలే గురించి చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. ఆయన మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా.  కిక్ 2లో ‘మమ్మీ కడుపులోన నాకు కంపర్ట్ లేదని’ పాట పాడింది ఈయనే. సంగీత దర్శకుడు కోటీ పాటు కెరియర్ స్టార్ట్ చేసిన భోలే.. పలు సినిమాల్లో మంచి సాంగ్స్ పాడాడు. సినిమాల్లో ఎంకరేజ్‌మెంట్ అంతగా లేకపోవడంతో ప్రైవేట్ ఆల్బమ్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అతను డిజైన్ చేసిన  పాలమ్మినా.. పూలమ్మినా పాట.. సెన్సేషన్ క్రియేట్ చేసింది. బిగ్ బాస్‌కి వెళ్లి వచ్చిన తర్వాత కూడా పలు ప్రైవేట్ సాంగ్స్ చేశాడు భోలే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో