
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘భీమ్లా నాయక్’. మలయాళం సూపర్ హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియం’కు తెలుగు రీమేక్‌గా ఇది తెరకెక్కుతోంది. పవన్‌కు జోడీగా నిత్యా మేనన్, రానా సరసన ఐశ్వర్యా రాజేష్ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, టీజర్లు సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఆసక్తికరమైన అప్డేట్ రానుంది. దీపావళి సందర్భంగా గురువారం (నవంబర్4) సాయంత్రం 7.02 గంటలకు ‘లాలా భీమ్లా’ సాంగ్‌కు సంబంధించిన వీడియో ప్రోమోను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
దీపావళిని ఇలా సెలబ్రేట్ చేసుకుందాం.
ఈ సందర్భంగా ‘ఈ దీపావళిని # TheSoundOfBheemla’ తో సెలబ్రేట్ చేసుకుందాం అని పవన్ కల్యాణ్ కొత్త పోస్టర్‌ను ట్విట్టర్లో షేర్ చేసింది మూవీ యూనిట్. ఈ పోస్టర్లో పంచె ధరించిన పవన్ నుదుటిపై తిలకం పెట్టుకుని, ముందు మందు బాటిల్ పెట్టుకుని కనిపించారు. ఈ పోస్టర్ పవన్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. సాగర్ కే. చంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: