
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు పెళ్లిళ్లు అనేవి చాలా కామన్ గా మారిపోయాయి కొంతమంది రెండు , మూడు పెళ్లిళ్లు చేసుకొని వార్తల్లో నిలుస్తున్నారు. అంతే కాదు మరికొంతమంది రిలేషన్ షిప్స్ కారణంగా హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఈ మధ్య కొంతమంది పెళ్ళికి ముందే ప్రగ్నెంట్ అవుతున్నారు. చాలా మంది హీరోయిన్స్ పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ గా మారారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా పెళ్ళికి ముందు తల్లిగా మారబోతుంది. ఏకంగా బేబీ బంప్ ఫొటోతో షాక్ ఇచ్చింది. తాజాగా ఆమె ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఆమెకు మంచి క్రేజ్ ఉంది.. ఆమె వయసు ప్రస్తుతం 40ఏళ్లు ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
పెళ్లి కాకుండా తల్లికాబోతున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె మరెవరో కాదు కన్నడ నటి భావన. ఈ అమ్మడు కన్నడలో ఫెమస్ నటి. అక్కడ వరుసగా సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు పెళ్ళికాకుండా తల్లి అవ్వాలనుకునే స్త్రీలకు ఇది స్పూర్తిగా ఉంటుందని భవ్ఫిస్తున్నా.. అంటూ ఓ స్టోరీ రాసుకొచ్చింది భావన.
తనకు సపోర్ట్‌గా ఉన్న తల్లిదండ్రులు, తోబుట్టువులకు థాంక్స్ చెప్పింది భావన. సింగిల్ మదర్‌గా నా పిల్లలను పెంచాలనుకున్నా. ఐవీఎఫ్ ద్వారా కవలలను కనబోతున్నా.. 20,30 ఏళ్ల వయసులో నాకు ఇలా అనిపించలేదు.. 40ఏళ్ల వయసు వచ్చాక నాకు పిల్లలను కనాలనిపించింది.. కానీ చాలా మంది డాక్టర్స్ నన్ను రిజెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు కుదిరింది. త్వరలో రెండు సోల్స్ నన్ను అమ్మ అని పిలవబోతున్నాయి.. అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది భావన. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. దీని పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి