Shyam Singha Roy : నాని “శ్యామ్ సింగరాయ్” నుంచి అందమైన మెలోడీ.. ఆకట్టుకుంటున్న పాట

|

Nov 25, 2021 | 6:34 PM

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్. టాక్సీవాల సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్.

Shyam Singha Roy : నాని శ్యామ్ సింగరాయ్ నుంచి అందమైన మెలోడీ.. ఆకట్టుకుంటున్న పాట
Nani
Follow us on

Shyam Singha Roy : నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్. టాక్సీవాల సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్. అయితే నాని నటించిన వి, టక్ జగదీష్ సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలై ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయాయి. దాంతో ఇప్పుడు నాని అభిమానులంతా శ్యామ్ సింగరాయ్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.శ్యామ్ సింగరాయ్ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి ఈ సినిమాలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టైటిల్ సాంగ్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమానుంచి ఓ అందమైన లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.

నాని – కృతిశెట్టి మధ్య ప్రేమ గురించి తెలుపుతూ సాగిన ఈపాట బాగుంది. కృష్ణ కాంత్ అందించిన సాహిత్యం ఆకట్టుకుంటుంది. ఈ పాటను చైత్ర అందంగా ఆలపించారు. అలాగే మీకీ జె మేయర్ అందించిన సంగీతం వినసొంపుగా ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.ఈ నేపథ్యంలో శ్యామ్ సింగరాయ్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచనున్నారు చిత్రయూనిట్. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించడం తోపాటు ప్రధాన నగరాల్లో పర్యటించనున్నారట. ఈ క్రమంలోనే ఒక సిటీలో 3 వేలమంది అభిమానులతో ‘ఫ్యాన్ మీట్’ ను కూడా ఏర్పాటు చేయనున్నారని చెబుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

SS Rajamouli : ఆర్ఆర్ఆర్ సీన్ల‌ను లోతుగా చూస్తే ఎలా ఉంటుందో జ‌న‌ని పాట అలా ఉంటుంది : రాజమౌళి

Alia Bhatt: నెటిజన్ల మనసు గెల్చుకున్న అలియా.. అభిమానిని గుర్తు పెట్టుకుని పలకరించిన బాలీవుడ్‌ నటి..

Ananya Panday : లాస్‌ వేగాస్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న లైగర్‌.. ఫొటోలు షేర్‌ చేసిన అనన్య..