Vijay Deverakonda: విజయ్ ఫ్యాన్స్‌కు గోల్డెన్ ఆఫర్.. రౌడీ హీరో సినిమాలో నటించే ఛాన్స్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయమైన విజయ్ దేవరకొండ.. ఆతర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయాడు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు

Vijay Deverakonda: విజయ్ ఫ్యాన్స్‌కు గోల్డెన్ ఆఫర్.. రౌడీ హీరో సినిమాలో నటించే ఛాన్స్
Vijay Devarakonda

Updated on: Feb 10, 2025 | 7:29 PM

స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో మరో క్రేజీ మూవీలో నటిస్తున్నారు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘రాజా వారు రాణి గారు’ సినిమాతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీసీ సంస్థలో వస్తున్న 59వ చిత్రమిది. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా రూపొందనుంది.

ఈ రోజు ఈ సినిమా నుంచి ఆడిషన్స్ అనౌన్స్ మెంట్ చేశారు. 25-65 ఏళ్ల వయసున్న మేల్, 25-60 ఏళ్ల వయసు గల ఫీమేల్ ఆర్టిస్టులు, నటనలో ఆసక్తి గల 5-14 ఏళ్ల బాయ్స్, 5-12 ఏళ్ల గర్ల్స్ ఈ ఆడిషన్స్ లో పాల్గొనవచ్చు. కాకినాడ హోటల్ శ్రీవత్సలో ఈ నెల 15, రాజమండ్రి హోటల్ సూర్యలో ఈ నెల 17న, భీమవరం హోటల్ గ్రాండ్ లీల కృష్ణలో ఈ నెల 19న ఈ ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. ఔత్సాహిక నటీనటులకు ఇదొక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు.

నాగవంశీ నిర్మాతగా విజయ్ దేవరకొండ 12వ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. గౌతమ్ తిన్ననూరి సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఆకట్టుకునే కంటెంట్ తో సినిమాలు తెరకెక్కిస్తుంటాడు ఈ యంగ్ డైరెక్టర్. ఇక ఇప్పుడు విజయ్ తోనూ అలాంటి స్టోరీనే తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. తాజాగా మహా కుంభమేళలో ప్రత్యక్షమయ్యాడు విజయ్ దేవరకొండ. దాంతో విజయ్ న్యూ లుక్ వైరల్ అయ్యింది.

Vijay Devarakonda

Follow Us