
తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అంజూ కురియన్ పెళ్లి చేసుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త రోషన్ కరిప్పపరంబిళ్తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. కేరళలో క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం శనివారం ఈ శుభకార్యం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను స్వయంగా అంజూనే సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అంజూ కురియన్ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా 2024 అక్టోబర్ లో అంజూ- రోషన్ ల నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. అయితే ఆ తర్వాత వివిధ కారణాలతో పెళ్లి వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు ఇప్పుడు పెళ్లిపీటలెక్కారు అంజూ- రోషన్. ఇక అంజు విషయానికి వస్తే.. కేరళలోని కొట్టాయం ప్రాంతంలో పుట్టి పెరిగింది. చెన్నైలోని హిందుస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో ఆర్కిటెక్చర్ లో డిగ్రీ పట్టా పుచ్చుకుంది. సినిమాల్లోకి వచ్చేముందుకు ఒక ప్రముఖ సంస్థలో రెండేళ్ల పాటు వర్క్ చేసింది. అయితే నటనపై మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
మోడల్ గా కెరీర్ ప్రారంభించిది అంజు కురియన్. ఇక 2013లో ‘నేరమ్’ అనే మలయాళ మూవీతో నటిగా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ప్రేమమ్, ఓం శాంతి ఓషానా , కవి ఉద్దీతుత్తు, నాన్ ప్రకాశన్, జాక్ అండ్ డేనియల్, మెప్పడియాన్, అబ్రహం ఓస్లర్ తదితర సినిమాల్లో హీరోయిన్ గానూ, సహాయక నటి పాత్రలు పోషించిందీ అందాల తార. 018లో ‘ఇదం జగత్’ అనే తెలుగు చిత్రంలోనూ హీరోయిన్గా చేసింది అంజు కురియన్. ఇక ఇటీవల ఓహో ఎంతన్ బేబీ, అదర్స్, ఇదయం మురళి సినిమాల్లో కనిపించిందీ ముద్దుగుమ్మ.
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ అంజూకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె షేర్ చేసే ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంటుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి