Anjali: మరో గోల్డెన్ ఛాన్స్ పట్టేసిన అంజలి.. ఈసారైనా ఇక్కడ నిలదొక్కుకుంటుందా…?

|

Apr 17, 2021 | 8:23 AM

సిల్వర్‌ స్క్రీన్ మీద సీతమ్మ పాత్రతో సూపర్‌ హిట్ అందుకున్న అంజలి.. ఆ తరువాత అదే జోరు కంటిన్యూ చేయలేకపోయారు. కొద్ది రోజులు తమిళ్‌లో...

Anjali: మరో గోల్డెన్ ఛాన్స్ పట్టేసిన అంజలి.. ఈసారైనా ఇక్కడ నిలదొక్కుకుంటుందా...?
సూపర్ స్టార్ మహేష్ బాబు, వెంకటేష్ కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీత పాత్ర  తెచ్చిపెట్టింది. 
Follow us on

సిల్వర్‌ స్క్రీన్ మీద సీతమ్మ పాత్రతో సూపర్‌ హిట్ అందుకున్న అంజలి.. ఆ తరువాత అదే జోరు కంటిన్యూ చేయలేకపోయారు. కొద్ది రోజులు తమిళ్‌లో, కొద్ది రోజులు తెలుగులో సినిమాలు చేస్తూ ఏ ఇండస్ట్రీలోనూ టాప్ పోజిషన్‌కు చేరలేదు. దీంతో నెమ్మదిగా కెరీర్ కూడా మసకబారింది. తెలుగులో అయితే సినిమాలే లేకుండా పోయాయి.  ఈ పరిస్థితుల్లో అంజలి కెరీర్‌కు బూస్ట్ ఇచ్చిన సినిమా వకీల్ సాబ్‌. పింక్ రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో తెలుగులో మరోసారి సూపర్‌ హిట్ అందుకున్నారు అంజలి. ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ జోష్‌ను అలాగే కంటిన్యూ చేసే న్యూస్‌ ఒకటి ఫిలిం సర్కిల్స్‌లో ట్రెండ్ అవుతోంది.

తెలుగు మరో క్రేజీ మూవీలో ఛాన్స్‌ కొట్టేశారు అంజలి. వకీల్ సాబ్ ప్రొడ్యూసర్ దిల్‌ రాజు బ్యానర్‌లోనే తెరకెక్కుతున్న ఎఫ్‌ 3 సినిమాలో ఇంపార్టెంట్‌ రోల్‌లో నటిస్తున్నారు అంజలి. మరి ఈ వరుస ఆఫర్స్‌తో టాలీవుడ్‌లో అంజలి కెరీర్‌ ఊపందుకుంటుందేమో చూడాలి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాం. అంజలి తెలుగమ్మాయే.. తొలుత తమిళ ఇండస్ట్రీలోనే ప్రాచూర్యం పొందింది. టాలెంట్ ఉన్నా కూడా ఈ అమ్మడుకు సరైన పాత్రలు ఇప్పటివరకూ దక్కలేదనే చెప్పాలి.

Also Read: డ్యాన్స్‌ ప్రాక్టీస్‌తో బిజీగా కుందనపు బొమ్మ సునీత.. ఫిమేల్ లీడ్‌గా సినిమాల్లోకి !

ఏపీలో రెండు నెలల పాటు చేపల వేట బ్యాన్.. మత్స్యకారులకు పది వేల రూపాయల భృతి.. ఆ రోజున ఖాతాల్లోకి డబ్బు