బుల్లితెరపై యాంకర్ అనసూయకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్నేళ్లుగా బుల్లితెరపై మకుటం లేని మహరాణిగా.. టాప్ యాంకర్‌గా కొనసాగుతుంది ఈ ముద్దుగుమ్మ. కేవలం యాంకర్‌గానే కాకుండా.. వెండితెరపై భిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రంగస్థలం సినిమాలో అనసూయ నటనకు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఫిదా అయ్యారు. ఈ సినిమాతో వెండితెరపై అనసూయ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. వరుస ఆఫర్లను అందుకుంటూ అటూ బిగ్ స్క్రీన్ పై కూడా బిజీగా మారిపోయింది అనసూయ.
ఎప్పుడూ బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలోనూ ఎప్పటికప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. లెటేస్ట్ ఫోటోలను.. వ్యక్తిగత.. సినిమా విషయాలను నెట్టింట్లో షేర్ చేస్తూ అభిమానులకు అందుబాటులో ఉంటుంది ఈ అమ్మడు. కేవలం సినిమా విషయాలపైనే కాకుండా.. ప్రస్తుతం సామాజిక పరిస్థితులపై కూడా అనసూయ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా స్పందిస్తుంది. తాజాగా స్కూల్స్ రీఒపెనింగ్ పై అనసూయ ఆసక్తికర ట్వీట్ చేసింది. కేటీఆర్ సర్ నాకో డౌట్ అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
“డియర్ కేటీఆర్ సర్.. అసలు లాక్డౌన్ ఎందుకు వచ్చిందో.. ఆపై అన్‌లాక్ కూడా ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోవాలి.. మనందరికీ వ్యాక్సిన్ వేస్తున్నామని కాస్త భరోసా ఇవ్వొచ్చు.. అయితే టీకా వేయాల్సిన వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల సంగతేంటి సార్? ? పాఠశాలలు తల్లిదండ్రులను ఎందుకు బలవంతం చేస్తున్నాయి ”
“పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు వారికి ఏమైనా జరిగితే మాకు బాధ్యత లేదని పాఠశాల యాజమాన్యాలు సంతకం చేయించుకుంటున్నాయి.. ఇది ఎంతవరకు న్యాయమో.. మీరే చెప్పండి సార్… మీరు ఎప్పటిలాగే మాకు సరైన మార్గనిర్దేశం చేస్తారని ఆశిస్తున్నాను”.. అంటూ ట్వీట్ చేసింది అనసూయ.
ట్వీట్..
Dear @KTRTRS Sir.. I want to understand why there was lockdown in the first place..and then there is unlock.. we can be a bit assured that we are all getting vaccinated..but what about the children below the required vaccine age sir?? Why are the schools forcing the parents (1/2)
— Anasuya Bharadwaj (@anusuyakhasba) October 29, 2021
(2/2) to send the children to school with a signed document which says they are NOT responsible if/whatsoever happens to the children while they are at school.. tell me sir.. how fair is this.. hoping you would guide us right as always.. we are all in a fix ??
— Anasuya Bharadwaj (@anusuyakhasba) October 29, 2021
Also Read: RajiniKanth: రజినీ కాంత్ ఆరోగ్యంపై స్పందించిన భార్య లత..ఏం చెప్పారంటే..
Kandikonda: క్యాన్సర్‌తో పొరాడుతున్న రచయిత కందికొండ.. సాయం చేసిన సింగర్ ..
Varudu Kavalenu Twitter Review: వరుడు కావలెను ట్విట్టర్ రివ్యూ.. నాగశౌర్య సినిమా ఎలా ఉందంటే..