
‘బేబీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు యంగ్ జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య. వీరిద్దరూ కలిసి నటించిన మరో లవ్ రొమాంటిక్ డ్రామా ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. 90s మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ తో అందరి ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఈ మూవీని తెరకెక్కించారు. రిలీజ్ కు ముందు ఈ సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్, ట్రైలర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే తీరా థియేటర్లలో రిలీజయ్యాక ఎపిక్ సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. సెప్టెంబర్ 11న రిలీజైన ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీకి నెగెటివ్ టాక్ వచ్చింది. దీనికి తోడు సినిమాలోని కంటెంట్, కొన్ని సన్నివేశాలపై విమర్శలు కూడా వచ్చాయి. అయితే యూత్ మాత్రం ఈ సినిమాను బాగానే ఎంజాయ్ చేశారు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఆ నేపథ్యంలో అక్టోబర్ 09 నుంచే ఈ సినిమా ఓటీటీలోకి రానుందని సమాచారం. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషలు, హిందీలోనూ ఎపిక్ సినిమా స్ట్రీమింగ్ కు రావొచ్చని తెలుస్తోంది.
సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఎపిక్ సినిమాను నిర్మించారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యలతో పాటు వాసుకి, శివాజీ, కల్యాణి శంకర్, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషించారు. హేషమ్ అబ్దుల్ వాహాబ్ సంగీతం అందించారు. కాగా ఈ మధ్యన థియేటర్లలో ఆడని సినిమాలు ఓటీటీలో దుమ్ము రేపుతున్నాయి. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై రికార్డు వ్యూస్ తెచ్చుకుంటున్నాయి. ఇప్పుడు ఎపిక్ సినిమా మేకర్స్ కూడా ఇదే అలోచిస్తున్నారు. పైగా ఈ మూవీలో యూత్ కు నచ్చే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఓటీటీ ద్వారా మరింత మందికి ఈ సినిమా చేరువయ్యే అవకాశం ఉంది. ఈ కారణంగానే ఓటీటీ విడుదల సమయంలో ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ను కేవలం తెలుగుకే పరిమితం చేయకుండా ఇతర భాషల్లోనూ అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
📢 Official Announcement 🍿
🎬 #EPIC – First Semester
📅 Streaming From: October 9
📺 Exclusively on Netflix
🗣️ Telugu • Tamil • Malayalam • Kannada • Hindi 🍿
⭐ Starring: Anand Deverakonda • Vaishnavi Chaitanya
🎬 Written & Directed by: Aditya Haasan
🎥 Produced by: Naga… pic.twitter.com/ruazEOOaEQ— Cineverse (@cineverse_offl) September 28, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి