War 2 : వార్ 2 కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్.. ఎన్టీఆర్, హృతిక్ సినిమాకు అదే హైలెట్..

చాలా కాలంగా 'వార్ 2'కి సంబంధించి వస్తున్న అప్‌డేట్‌లను బట్టి ఈ సినిమా కూడా చాలా భారీగా ఉండబోతోందని తెలుస్తోంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని మరింత పెద్దదిగా చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఇందులో తొలిసారి తారక్, హృతిక్ కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ పై చూసేందుకు మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

War 2 : వార్ 2 కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్.. ఎన్టీఆర్, హృతిక్ సినిమాకు అదే హైలెట్..
Ntr
Follow us

|

Updated on: Apr 19, 2024 | 9:46 PM

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ‘వార్ 2’ గురించి చాలా కాలంగా బజ్ ఉంది. ఈ చిత్రం 14 ఆగస్టు 2025న థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీ మొదటి భాగానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 471 కోట్లు రాబట్టింది. చాలా కాలంగా ‘వార్ 2’కి సంబంధించి వస్తున్న అప్‌డేట్‌లను బట్టి ఈ సినిమా కూడా చాలా భారీగా ఉండబోతోందని తెలుస్తోంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని మరింత పెద్దదిగా చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఇందులో తొలిసారి తారక్, హృతిక్ కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ పై చూసేందుకు మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

ఇటీవలే వార్ 2 సెట్ లో అడుగుపెట్టారు తారక్. ఈ మూవీ షూటింగ్ సెట్ నుంచి లీకైన ఫోటోస్ వార్ పై మరింత హైప్ పెంచింది. ఇక ఇప్పుడు మరోసారి వార్ 2 సినిమాపై బజ్ నెలకొంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో అమెరికన్ యాక్షన్ డైరెక్టర్ స్పిరో రాజటోస్ జాయిన్ అయ్యారని తెలుస్తోంది. ఈ సినిమా యాక్షన్‌ని ఆయనే డిజైన్ చేస్తారని అంటున్నారు.

వార్ 2 చిత్రానికి బ్రహ్మాస్త్రం ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. అలాగే తారక్ సరసన యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి కనిపించనుందని అంటున్నారు. దీనిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. మూవీ లవర్స్ ఇంతకు ముందెన్నడూ చూడని యాక్షన్‌ని చూపించాలనుకుంటున్నాడు అయాన్ ముఖర్జీ. ఈ సినిమా కోసం ఆదిత్య చోప్రా కూడా భారీ ప్లాన్స్‌లో ఉన్నాడని, దీని వల్ల ‘వార్’ ఫ్రాంచైజీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు వస్తుందని అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.