Allu Sirish: అల్లు శిరీష్ భార్యలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా? నెట్టింట వైరలవుతోన్న నయనిక వీడియో

టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ ఈ ఏడాది ప్రారంభంలో నయనికతో కలిసి ఏడడుగులు నడిచాడు. ప్రస్తుతం ఈ దంపతులు తమ వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. అయితే తాజాగా అల్లు శిరీష్ తన భార్య నయనికకు సంబంధించి ఒక ఆసక్తికర విషయాన్ని బయట పెట్టాడు.

Allu Sirish: అల్లు శిరీష్ భార్యలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా? నెట్టింట వైరలవుతోన్న నయనిక వీడియో
Allu Sirish Wife Nayanika

Updated on: Aug 02, 2026 | 2:40 PM

ఈ ఏడాది ప్రారంభంలో ఓ ఇంటివాడయ్యాడు హీరో అల్లు శిరీష్. తన ప్రియురాలు నయనికతో కలిసి కొత్త జీవితం ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ దంపతులు తమ వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారీ లవ్లీ కపుల్. తమ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు విషయాలను సామాజిక మాధ్యమాల వేదికగా అందరితో షేర్ చేసుకుంటున్నారు. అలా తాజాగా అల్లు శిరీష్ తన భార్య నయనికకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేసుకున్నాడు. అదేంటంటే.. ఇటీవల అల్లు, మెగా ఫ్యామిలీలో ఒక ఆధ్యాత్మిక పూజా కార్యక్రమం జరిగింది. దీనికి మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ, అల్లు అరవింద్ సతీమణి నిర్మలమ్మ, అల్లు అర్జున్ భార్య స్నేహ తదితరులు హాజరయ్యారు. అయితే ఇదే కార్యక్రమంలో నయనిక
ఎంతో భక్తి శ్రద్ధలతో పాటలు పాడుతూ కనిపించింది. ఎల్లో కలర్ ట్రెడిషనల్ చీరలో ముస్తాబైన ఆమె పాటలు పాడుతుంటే అక్కడున్న వారందరూ భక్తిలో లీనమైపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలనే ఇన్ స్టా స్టోరీస్ లో షేర్ చేశాడు అల్లు శిరీష్. నయనికలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా!అన్నట్లు ఆశ్చర్యపోయేలా ఒక క్రేజీ క్యాప్షన్ ఇచ్చాడు.

ప్రస్తుతం అల్లు అర్జున్ భార్య నయనికకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. దీనిని చూసిన మెగాభిమానులు,నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అల్లు వారి కోడలు అంటే ఆ మాత్రం ఉండాలి. ఆమె సంప్రదాయాలను గౌరవించడం చాలా బాగుంది’అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

భక్తి పాటలు పాడుతోన్న అల్లు శిరీష్ సతీమణి నయనిక .. వీడియో..

ఇక సినిమాల విషయానికి వస్తే.. పెళ్లి తర్వాత మళ్లీ సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతున్నాడు అల్లు శిరీష్. చివరిగా అతను 2024లో బడ్డీ అనే సినిమాలో కనిపించాడు. ఆ తర్వాత పెళ్లి పనులతో బిజీ అయిపోయాడు. అయితే ఇప్పుడు మళ్లీ సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడీ అల్లు వారబ్బాయి. త్వరలోనే తన ప్రాజెక్టులకు సంబంధించి ఒక ప్రకటన రానుంది.

భార్య నయనికతో అల్లు శిరీష్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us