Allu Arjun: ప్రభాస్ డైరెక్టర్‌తో ఐకాన్ స్టార్ సినిమా.. అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనేనా..?

|

Nov 27, 2021 | 12:34 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పరాజ్‌గా మారి తెగ కష్టపడుతున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వలో తెరకెక్కుతున్న పుష్ప సినిమా.

Allu Arjun: ప్రభాస్ డైరెక్టర్‌తో ఐకాన్ స్టార్ సినిమా..  అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనేనా..?
Bunny
Follow us on

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పరాజ్‌గా మారి తెగ కష్టపడుతున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వలో తెరకెక్కుతున్న పుష్ప సినిమా. ఈ సినిమాలో ఊర మాస్ గా కనిపించనున్నాడు బన్నీ. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా లక్కీ బ్యూటీ రష్మిక మందన్న నటిస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా తర్వాత బన్నీ వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకు ఐకాన్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. నిజానికి ఈ సినిమాను ఎప్పుడో అనౌన్స్ చేశారు కానీ ఇంతవరకు పట్టాలెక్కలేదు. పుష్ప సినిమా తర్వాత ఐకాన్ ను స్టార్ట్ చేయనున్నారు. అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు బన్నీ. అయితే తాజాగా బన్నీ లిస్ట్ లోకి మరో దర్శకుడి పేరు వచ్చిందని తెలుస్తుంది. ప్రభాస్‌తో రాధేశ్యామ్ సినిమా చేస్తున్న దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేయనున్నాడని టాక్

గోపిచంద్ హీరోగా వచ్చిన జిల్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు రాధాకృష్ణ. ఇప్పుడు ప్రభాస్ హీరోగా రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గానటిస్తుంది. ప్రియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రభస్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తర్వాత రాధాకృష్ణ బన్నీని డైరక్ట్ చేయబోతున్నారని అంటున్నారు. మరో వైపు బన్నీతో సినిమా చేయడానికి బోయపాటి సిద్ధంగా ఉన్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబోలో సరైనోడు సినిమా వచ్చి సూపర్ హిట్ అందుకుంది. మరి పుష్ప తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేస్తాడో చూడాలి. ఇక పుష్ప సినిమా రెండు భాగాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే.. మొదటి భాగం డిసెంబర్ 17న విడుదల కానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

KS Nageswara Rao: ప్రముఖ సినీ దర్శకుడు కన్నుమూత.. విషాదంలో టాలీవుడ్..

Hari Hara Veera Mallu : తిరిగి పట్టాలెక్కనున్న పవన్ – క్రిష్ సినిమా.. ఎప్పడినుంచి అంటే.

Chiranjeevi: మరోసారి కలిసి నటించనున్న మెగాస్టార్- మెగాపవర్ స్టార్.. ఏ సినిమాలో అంటే..