Allu Arha: బుజ్జి గణపయ్యను తయారు చేసిన బన్నీ గారాలపట్టి.. అమ్మాయిగారి టాలెంట్ అదుర్స్ అంటున్న నెటిజన్లు..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అర్హ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఈ చిన్నారికి సోషల్ మీడియాలో అభిమానులు ఎక్కువగానే ఉన్నారు.

Allu Arha: బుజ్జి గణపయ్యను తయారు చేసిన బన్నీ గారాలపట్టి.. అమ్మాయిగారి టాలెంట్ అదుర్స్ అంటున్న నెటిజన్లు..
Arha

Updated on: Sep 09, 2021 | 11:14 AM

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అర్హ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఈ చిన్నారికి సోషల్ మీడియాలో అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. అర్హకు సంబంధించిన ప్రతి అప్డేట్.. లెటేస్ట్ ఫోటోలను అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి నెట్టింట్లో షేర్ చేస్తూ ఉంటుంది. ఇప్పటికే అర్హకు సంబంధించిన ఎన్నో ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంటాయి. బన్నీ డాటర్ ఇక వెండితెరపైకి కూడా అరంగేట్రం చేస్తుంది. సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలం సినిమాలో అర్హ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది బన్నీ డాటర్. ఇక అర్హకు చిన్న వయసులోనే టాలెంట్ ఎంతో ఉంది. అల్లు అర్హకు, అయాన్‏కు మట్టితో బొమ్మలు చేయడం చాలా ఇష్టం. గతంలో కూడా వీరిద్దరు చేసిన మట్టి బొమ్మలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

తాజాగా అల్లు అర్హకు సంబంధించిన ఓ లెటేస్ట్ ఫోటోను షేర్ చేశారు తన ఇన్‏స్టా స్టోరీలో షేర్ చేశారు స్నేహ రెడ్డి. అందులో అర్హ.. తన చిన్న చిన్న చేతులతో బుజ్జి మట్టి గణపయ్యను రెడీ చేసింది. రేపు వినాయక చవితి కావడంతో అల్లు అర్హ.. తన చేతులతో స్వయంగా మట్టి గణపతిని తయారు చేసిన ఫోటోను షేర్ చేశారు స్నేహరెడ్డి. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చిన్న వయసులోనే అర్హ టాలెంట్‏కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఇన్‏స్టా పోస్ట్..

Also Read: PSPK 28 : పవర్ స్టార్ అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన హరీష్ శంకర్.. కేక పెట్టిస్తున్న పవన్ లుక్

Tollywood Drugs case: ఈడీ కార్యాలయానికి చేరుకున్న మాస్ రాజా.. రవితేజ పై కురవనున్న ప్రశ్నల వర్షం

Bigg Boss 5 Telugu: ఆ కంటెస్టెంట్ పై మానస్ అసహనం.. ఓవరాక్షన్ ఎక్కువైందంటూ కామెంట్స్..

 

Loading...
Unable to load recommendations.
Follow Us