Bimbisara: బింబిసారుడి యాక్టింగ్‌కు బన్నీ ఫిదా.. అందుకే కల్యాణ్‌రామ్‌ అంటే తనకెంతో గౌరవమంటూ పోస్ట్‌

|

Aug 08, 2022 | 8:11 AM

Bimbisara Movie: కరోనా పరిస్థితులు.. థియేటర్‌ రేట్లపై విమర్శలు.. ఓటీటీలు చూసే అలవాట్లు..! వెరసి థియేటర్ కు దూరమైన తెలుగు ప్రేక్షకులను థియేటర్లకు మరో సారి దగ్గర చేస్తోంది కల్యాణ్‌ రామ్‌ (Kalyan Ram) నటించిన బింబిసార (Bimbisara).

Bimbisara: బింబిసారుడి యాక్టింగ్‌కు బన్నీ ఫిదా.. అందుకే కల్యాణ్‌రామ్‌ అంటే తనకెంతో గౌరవమంటూ పోస్ట్‌
Allu Arjun
Follow us on

Bimbisara Movie: కరోనా పరిస్థితులు.. థియేటర్‌ రేట్లపై విమర్శలు.. ఓటీటీలు చూసే అలవాట్లు..! వెరసి థియేటర్ కు దూరమైన తెలుగు ప్రేక్షకులను థియేటర్లకు మరో సారి దగ్గర చేస్తోంది కల్యాణ్‌ రామ్‌ (Kalyan Ram) నటించిన బింబిసార (Bimbisara). దగ్గరకు చేయడమే కాదు.. సినిమాను థియేటర్లో చూడాలనే ఫీల్‌ను వారికి కలిగిస్తోంది. దీంతో ఈ సినిమాపై.. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్ పై ఫుల్ ఖుషీ అవుతున్నారు ఇండస్ట్రీ పీపుల్స్. ఖుషీ అవ్వడమేకాదు.. బింబిసార టీంను అప్రిషియేట్ చేస్తూ.. సోషల్‌ మీడియాలో పోస్టులు షేర్‌ చేస్తున్నారు. ఇప్పటికే బింబిసార సినిమాను.. ఆ సినిమా కాస్ట్ అండ్ క్రూను అప్రిషియేట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. చిరుతో పాటు.. లైగర్ విజయ్‌ దేవరకొండ కూడా బింబిసారను తెగ మెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు వీరిలాగే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun) కూడా.. బింబిసార పై ట్వీట్ చేశారు.

కల్యాణ్‌రామ్‌ అంటే నాకు గౌరవం..

ఇవి కూడా చదవండి

‘బిగ్ కంగ్రాట్చూలేషన్స్ టూ బింబిసార టీం. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ అండ్.. ఎంగేజింగ్ ఫాంటసీ ఫిల్మ్. బింబిసారుడిగా నందమూరి కల్యాణ్ రామ్‌ సూపర్ ఇంపాక్ట్ చూపించారు. ఎప్పుడూ ఇండస్ట్రీకి కొత్త ట్యాలెంట్ తీసుకువస్తూ.. కొత్త తరహా సినిమాలు చేస్తున్న ఆయనంటే.. నాకు ఎంతో గౌరవం’ అని ట్వీట్ చేశారు బన్నీ. అంతేకాదు..బింబిసార డైరెక్టర్ వశిష్ఠను కూడా అభినందించారు అల్లు అర్జున్‌. ఈ సినిమాను సూపర్ గా హ్యాడిల్ చేశారంటూ.. ఆర్టిస్టులనీ.. టెక్నీషియన్లనీ.. సూపర్ గా కమాండ్‌ చేశారంటూ మరో ట్వీట్లో రాసుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..