
పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ పుట్టినరోజు ఏప్రిల్ 8. ఈ క్రమంలో ఒక రోజు ముందుగానే బన్నీ బర్త్ డే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. యావత్ దేశవ్యాప్తంగా బన్నీ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ పుట్టినరోజున రాబోయే కొత్త సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం బన్నీ హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ఓ భారీ బడ్జెట్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో రాబోయే ఈ సినిమాపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే కథానాయికగా నటిస్తుంది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది.
ఎక్కువమంది చదివినవి : Ram Gopal Varma : ఇండస్ట్రీలో గట్స్ ఉన్న హీరో అతనొక్కడే.. అందుకే ఆ రేంజ్లో ఉన్నాడు.. రామ్ గోపాల్ వర్మ..
తాజాగా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా కాసేపటి క్రితం ఈ సినిమా కొత్త పోస్టర్ రిలీవ్ చేసింది. టైటిల్ పోస్టర్ ఏప్రిల్ 8న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అలాగే ఈ సినిమా నుంచి సరికొత్త పోస్టర్ రివీల్ చేసింది. . ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా.. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. హిందీలో షారుఖ్ ఖాన్ తో జవాన్ చిత్రాన్ని తెరకెక్కించిన అట్లీ ఇప్పుడు బన్నీతో ఎలాంటి ప్రాజెక్ట్ రూపొందించనున్నారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
ఎక్కువమంది చదివినవి : Kichcha Sudeep: ఆర్జీవీ లేకపోతే నాకు సినిమా అవకాశాలు వచ్చేవే కాదు.. అసలు విషయం చెప్పిన కిచ్చా సుదీప్..
ఈ చిత్రాన్ని ఒక హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ అని అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్ తో పాటు భారీ వీఎఫ్ఎక్స్ ఉండనున్నట్లు ముందు నుంచి టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన పలు విషయాలు ఇదివరకే నెట్టింట చక్కర్లు కొట్టాయి.
ఎక్కువమంది చదివినవి : Cinema OTT: దృశ్యం సినిమా కంటే 100 రెట్లు ఎక్కువ సస్పెన్స్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Brace for the BlAAst💥
Title Poster – Tomorrow @ 11 AM@alluarjun @Atlee_dir @deepikapadukone#AA22xA6 pic.twitter.com/pPHn70C77o
— Sun Pictures (@sunpictures) April 7, 2026
ఎక్కువమంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో వయసులో చిన్నోడు.. కానీ చేతులెత్తి నమస్కరిస్తున్నా.. తనికెళ్ల భరణి కామెంట్స్..