ప్రభాస్ నటించిన సలార్ సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. డిసెంబర్ 22న విడుదలైన ఈ మూవీ మొదటి రోజే ఏకంగా రూ. 170 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ప్రభాస్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా సలార్ మేనియానే నడుస్తోంది. సోషల్ మీడియాలోనూ ప్రభాస్ సినిమా గురించే చర్చ. ప్రస్తుతం సలార్ ట్రెండ్ చూస్తుంటే వెయ్యికోట్ల వసూళ్లు పక్కా అంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ మరో కీలక పాత్రలో మెరిశాడు. అలాగే జగపతిబాబు, బాబీ సింహా, టినూ ఆనంద్, రమణ, ఈశ్వరీ రావు, శ్రియా రెడ్డి, రామచంద్ర రాజు, మధు గురుస్వామి, బ్రహ్మాజీ, దేవ్ రాజ్, సప్తగిరి.. ఇలా భారీ తారాగణమే ఉంది సలార్ మూవీలో. ఇక ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరో అంత కాకపోయినా హీరోయిన్లకు కూడా చాలా ప్రాధాన్యముంటుంది. కేజీఎఫ్ సిరీస్ సినిమాల్లో ఇది నిరూపితమైంది. అయితే సలార్ విషయానికొస్తే.. ట్రైలర్ రిలీజ్ చేశాక సినిమాలో హీరోయిన్ శ్రుతి హాసన్ కు పెద్దగా ఇంపార్టెన్స్ లేదని చాలా మంది భావించారు. అయితే సలార్ సినిమా కథ శ్రుతిహాసన్ తోనే ప్రారంభమవుతుంది. మూవీలో శ్రుతి కనిపించేది కొన్ని సన్నివేశాలే అయినప్పటికీ కథలో ఆమె పాత్ర చాలా కీలకం. సలార్ మూవీ చూసిన వారు ఎవరైనా ఇదే చెబుతారు. సలార్ తో ఈ ఏడాది శ్రుతి ఖాతాలో మరో హిట్ పడినట్లే.
అయితే సలార్ సినిమాలో హీరోయిన్‌గా ముందుగా అనుకుంది శృతిహాసన్ ని కాదట. ఆర్‌ఆర్‌ఆర్‌తో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అలియా భట్‌ను ముందు సంప్రదించారట. డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో పాటు మరికొందరు మేకర్స్ అలియా ఇంటికి వెళ్లి దీనిపై మాట్లాడారట. అయితే ఎందుకో గానీ అలియా సలార్ సినిమాపై ఆసక్తి చూపించలేదట. అప్పటికే తన డేట్స్ ఫుల్‌గా ఉండడం ప్రభాస్ సినిమాకు నో చెప్పిందట. దీంతో మేకర్స్ వెంటనే శ్రుతి హాసన్ ను సంప్రదించారట. ఆమె వెంటనే ఒకే చెప్పడంతో సినిమా పట్టాలెక్కిందట. సో.. అలా మొత్తానికి సలార్ రూపంలో ఒక బ్లాక్ బస్టర్‌ను మిస్ చేసుకుందన్న మాట అలియా. ప్రతిష్టాత్మక హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన సలార్ సినిమాకు రవి బ్రసూర్ సంగీతం అందించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.