Nagarjuna Akkineni: మా జీవితాల్లో ఆయన లేని లోటును భర్తీ చేయలేం.. నాగార్జున ఎమోషనల్ పోస్ట్ వైరల్

టాలీవుడ్ కింగ్ హీరో అక్కినేని నాగార్జున బాగా ఎమోషనల్ అయ్యారు. తన కుటుంబానికి ఆప్త మిత్రుడైన ఒక వ్యక్తి హఠాన్మరణంతో ఆయన తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ మేరకు అతనికి నివాళి అర్పిస్తూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు నాగ్.

Nagarjuna Akkineni: మా జీవితాల్లో ఆయన లేని లోటును భర్తీ చేయలేం.. నాగార్జున ఎమోషనల్ పోస్ట్ వైరల్
Nagarjuna Akkineni

Updated on: May 24, 2026 | 1:42 PM

టాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. డబ్బింగ్‌ చిత్రాల నిర్మాత, నెల్లూరు డిస్ట్రిబ్యూర్‌ గుజ్జలపూడి హరి (46) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. దీంతో అతని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. హరి మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు కూడా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో హీరో అక్కినేని నాగార్జున కూడా హరి మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ మేరకు హరితో తమ ఫ్యామిలీకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు నాగార్జున. ‘హరి మరణవార్త విని షాకయ్యాను. ఆయన ఇక లేడన్న విషయం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మా పరిచయం 25 సంవత్సరాలకు పైగా సాగింది. అక్కినేని కుటుంబానికి ఆయన ఒక పిల్లర్‌లా అండగా నిలబడ్డారు. మా జీవితాల్లో ఆయన లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక మంచి మనిషిని, గొప్ప డిస్ట్రిబ్యూటర్‌ను కోల్పోయింది’ అని ఎక్స్ (ట్విట్టర్) లో రాసుకొచ్చారు నాగ్. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిది.

కాగా తెలుగు చిత్రసీమలో హరికి మంచి గుర్తింపు ఉంది. పంపిణీదారుడిగా ఆయన ఎన్నో హిట్ సినిమాలను హరి పిక్చర్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేశారు. వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసినదీ ఆయనే. అంతేకాకుండా విశాల్‌, తమన్నా జంటగా నటించిన ఒక్కడొచ్చాడు చిత్రాన్ని తెలుగులో రిలీజ్‌ చేశారు. విశాల్‌ తమిళంలో నిర్మించిన పలు సినిమాలను తెలుగులో ‘హరి వెంకటేశ్వర పిక్చర్స్‌’ బ్యానర్‌పై విడుదల చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు వైజయంతి మూవీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, అన్నపూర్ణ స్టూడియోస్‌, శ్రేష్ఠ మూవీస్‌ తదితర ప్రొడక్షన్ బ్యానర్ల నుంచి వచ్చిన సినిమాలను నెల్లూరులో డిస్ట్రిబ్యూట్ చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డితో హరికి మంచి అనుబంధం ఉంది. అలాంటి వ్యక్తి సడెన్ గా చనిపోవడంతో టాలీవుడ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. హరికి ఓ భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ఇవి కూడా చదవండి

నాగార్జున ఎమోషనల్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us