Naga Chaitanya : చూడముచ్చటైన ఫోటో.. థ్యాంక్యూ మూవీ సెట్‌లో చై అలా.. రాశి ఇలా

| Edited By: Ravi Kiran

Apr 26, 2022 | 12:25 PM

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి ఆయా షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు.

Naga Chaitanya : చూడముచ్చటైన ఫోటో.. థ్యాంక్యూ మూవీ సెట్‌లో చై అలా.. రాశి ఇలా
Naga Chaitanya Rashi Khanna
Follow us on

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య(Naga Chaitanya )ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి ఆయా షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. గతేడాది శేఖర్ కమ్ముల తెరెకెక్కించిన లవ్ స్టోరీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని ఫాంలోకి వచ్చాడు చై.. ఇక ఇటీవల సంక్రాంతి కానుకగా బంగార్రాజు సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. అక్కినేని నాగార్జున, చైతూ కలిసి నటించిన ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రమ్యకృష్ణ, కృతిశెట్టి కీలకపాత్రలలో నటించారు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సిక్వెల్‏గా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయం సాధించింది. ప్రస్తుతం చైతూ.. థ్యాంక్యూ సినిమా చేస్తున్నాడు. అక్కినేని ఫ్యామిలీకి మనం లాంటి హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఇందులో  చైతన్య హాకీ ప్లేయర్ గా కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమానుంచి ఓ అందమైన ఫొటోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో చై ఫోన్‌ చూస్తుండగా, రాశీఖన్నా దర్శకనిర్మాతలతో మాట్లాడుతుంది. ఈ ఫొటోలో చై, రాశి చూడముచ్చటగా ఉన్నారు. థ్యాంక్యూ సినిమాలో అందాల భామ రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.. రాశితోపాటు వికాగోర్, మాళ‌వికా నాయ‌ర్‌లు కీల‌క‌పాత్ర‌లో కనిపించనున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tollywood drugs case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. క్షమాపణలు కోరారు ఎక్సైజ్ డైరెక్టర్‌..

KGF 2 Collections: ఆల్ టైం రికార్డ్స్ బ్రేక్ చేసిన రాఖీభాయ్.. హిందీలో కేజీఎఫ్ 2 హావా ఇదే..

Upcoming Movies: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో వచ్చే సినిమాలు ఇవే.. ఆచార్యతోపాటు ఇవి కూడా..