పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న బడా మూవీ కల్కి ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. విభిన్న కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీలో ప్రభాస్ భైరవగా కనిపించనున్నాడు. రీసెంట్ గా ఈ మూవీలో మేజర్ పార్ట్ లో కనిపించనున్న బిజి అనే రోబోట్ ను పరిచయం చేశారు. ఆ రోబో ఓ కార్. ఈ సినిమా కోసం స్పెషల్ గా ఆ కారును కస్టమైజ్ చేశారు. రీసెంట్ గా బుజ్జిని పరిచయం చేయడానికి ఓ గ్రాండ్ ఈవెంట్ ను కూడా నిర్వహించారు. రామోజీ ఫిలిం సిటీలో భారీగా ఈ ఈవెంట్ ను నిర్వహించారు.
50 వేలకు పైగా ప్రభాస్ అభిమానులు ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. కాగా ప్రభాస్ బుజ్జి కారులో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి అందరిని ఆశ్చర్యపోయేలా చేశారు. స్పెషల్ గా కస్టమైజ్ చేసిన ఆ కారు చూడటానికి చాలా వెరైటీగా ఉంది. తాజాగా ఈ కారును అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య నడిపాడు. ఇందుకు సంబందించిన వీడియోను కల్కి మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంజనీరింగ్‌లో ఉన్న రూల్స్ అన్నీ బ్రేక్ చేస్తూ దీనిని తయారు చేశారా అని ఫన్నీగా కామెంట్ చేశాడు నాగ చైతన్య.
నాగ చైతన్య కు కార్లు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇప్పటికే ఆయన దగ్గర చాలా కాస్ట్లీ కార్లు ఉన్నాయి. ఇటీవలే ఓలగ్జరీ కారు కూడా కొన్నాడు. తాజాగా ప్రభాస్ బుజ్జి పై చక్కర్లు కొట్టాడు నాగ చైతన్య. ఇక కల్కి 2898 ఎడి విషయానికొస్తే ఈ సినిమాను సైన్స్ ఫిక్షన్ కథతో తెరక్కించారు నాగ్ అశ్విన్. ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనె నటిస్తుంది. అలాగే దిశా పటాని కూడా కనిపించనుంది. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Look who’s met #Bujji… @chay_akkineni, hope you had a fantastic time.#Kalki2898AD #Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @BelikeBujji @saregamaglobal @saregamasouth #Kalki2898ADonJune27 pic.twitter.com/8odhpYDqMz
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) May 25, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.