AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LENIN Trailer : లెనిన్ ట్రైలర్ వచ్చేసింది..! అదరగొట్టిన అఖిల్.. ఈసారి హిట్టు పక్కా అంటున్న అభిమానులు

'నాగబంధం' కోసం ప్రాణం పెట్టి పని చేశాను. ఇంత భారీ ప్రాజెక్ట్ చేయడం నటుడిగా గొప్ప అదృష్టం. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఖచ్చితంగా ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుందని హీరో విరాట్ కర్ణ తెలిపాడు. జూలై 3న ఈ సినిమా గ్రాండ్ గా విడుదలకానుంది.

LENIN Trailer : లెనిన్ ట్రైలర్ వచ్చేసింది..! అదరగొట్టిన అఖిల్.. ఈసారి హిట్టు పక్కా అంటున్న అభిమానులు
Lenin
Rajeev Rayala
|

Updated on: Jun 30, 2026 | 8:20 PM

Share

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లెనిన్. ఈ సినిమా పై అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సారి లెనిన్ తో అఖిల్ హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. అచ్చం హాలీవుడ్‌ హీరోల ఉండే హ్యాండ్సమ్ హీరో.. అయినా కూడా అఖిల్‌కు ఇప్పటి వరకు ఒక్క సాలిడ్‌ హిట్‌ పడలేదు. చేసిన సినిమాలన్నీ వరుస డిజాస్టర్స్ గా నిలిచాయి. వాటిలో మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ పర్లేదు అనిపించినా మిగతా సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద పరాజాయాన్ని మూటగట్టుకున్నాయి. ఇక ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఏజెంట్‌ కూడా దారుణంగా డిజాస్టర్‌ కావడం అఖిల్‌ అభిమానులను నిరాశకు గురి చేసింది. మొదటి సినిమా మొదలుకొని ఒక్కటంటే ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకోలేదు. దాంతో లెనిన్ సినిమా పై అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇది కూడా చదవండి : Tollywood : ఇలాంటి లవ్ స్టోరీని కొట్టే సినిమానే లేదు.. 44 ఏళ్లు అవుతున్న అదే క్రేజ్

లెనిన్ సినిమాకు మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో కిరణ్ అబ్బవరం నటించిన వినరో భాగ్యం విష్ణు సినిమాకు దర్శకత్వం వహించాడు మురళీ. ఇక లెనిన్ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా లెనిన్ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. లెనిన్ సినిమాలో అఖిల్ మాస్ అవతార్ లో కనిపించనున్నాడు.

ఇది కూడా చదవండి : రెమ్యునరేషన్ అడిగితే చంపేస్తాం అంటున్నారు.. రోడ్డు మీద పట్టుకొని కొట్టారు..! కన్నీళ్లు పెట్టుకున్న నటుడు

గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. అలాగే అఖిల్ యాక్టింగ్ కూడా ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాలో శివాజీ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ ట్రైలర్ ఆకట్టుకుంది. లెనిన్ సినిమాకు తమన్ సంగీతాన్ని అందించారు. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జులై 10న ఈ సినిమా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. లెనిన్ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.

ఇది కూడా చదవండి :చిన్న సినిమా.. కట్ చేస్తే 8 రోజుల్లో 24 కోట్ల వసూళ్లు..! ఎక్కడ చూసిన ఈ మూవీ పేరే వినిపిస్తుంది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
తెలుగు రాష్ట్రాలకు మరో రెండు అమృత్ భారత్ రైళ్లు.. ఈ రూట్లోనే..
తెలుగు రాష్ట్రాలకు మరో రెండు అమృత్ భారత్ రైళ్లు.. ఈ రూట్లోనే..
స్వాతంత్ర్య వేడులకు ఖర్గే, రాహుల్ దూరం..!
స్వాతంత్ర్య వేడులకు ఖర్గే, రాహుల్ దూరం..!
శ్రీశైలంలో టీటీడీ తరహాలో వీఐపీ లెటర్లకు దర్శనం
శ్రీశైలంలో టీటీడీ తరహాలో వీఐపీ లెటర్లకు దర్శనం
స్క్రీన్‌ను తాకగానే ఫోన్‌కు ఎలా తెలిసిపోతుంది? అసలు సీక్రెట్ ఇదే!
స్క్రీన్‌ను తాకగానే ఫోన్‌కు ఎలా తెలిసిపోతుంది? అసలు సీక్రెట్ ఇదే!
ఆహా..! పచ్చని పొలాల్లో మువ్వన్నెల జెండా.. డ్రోన్‌తో వినూత్న దేశ..
ఆహా..! పచ్చని పొలాల్లో మువ్వన్నెల జెండా.. డ్రోన్‌తో వినూత్న దేశ..
డాట్ బాల్స్‌తో పిచ్చెక్కించిన తోపు బౌలర్లు.. ఫస్ట్ ప్లేస్ ఎవరంటే?
డాట్ బాల్స్‌తో పిచ్చెక్కించిన తోపు బౌలర్లు.. ఫస్ట్ ప్లేస్ ఎవరంటే?
వాట్సప్‌లో ఆయుష్మాన్ భారత్ పథకానికి దరఖాస్తు చేసుకోవడం ఎలా..?
వాట్సప్‌లో ఆయుష్మాన్ భారత్ పథకానికి దరఖాస్తు చేసుకోవడం ఎలా..?
బెల్లంతో సేమియా పాయసం.. పాలు విరగదు, సేమియా ముక్కలవ్వదు
బెల్లంతో సేమియా పాయసం.. పాలు విరగదు, సేమియా ముక్కలవ్వదు
చెక్క చెప్పులు పోయాయని ChatGPTనే అడిగాడు..!
చెక్క చెప్పులు పోయాయని ChatGPTనే అడిగాడు..!
నాగలోకం నిజంగా ఉందా? పురాణాల్లో వర్ణించిన సర్పరాజుల రహస్య ప్రపంచం
నాగలోకం నిజంగా ఉందా? పురాణాల్లో వర్ణించిన సర్పరాజుల రహస్య ప్రపంచం