Most Eligible Bachelor: అఖిల్ ఆశలన్నీ ఆ సినిమాపైనే.. వరుస ఫ్లాపులకు చెక్ పెట్టేనా.?

|

Apr 05, 2021 | 8:02 AM

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం మోస్ట్ ఎలిసిజిబుల్ బ్యాచిలర్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

Most Eligible Bachelor:  అఖిల్ ఆశలన్నీ ఆ సినిమాపైనే.. వరుస ఫ్లాపులకు చెక్ పెట్టేనా.?
Akhil
Follow us on

Most Eligible Bachelor: అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక చాలా కాలంగా అఖిల్ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.మొదటి సినిమానే యాక్షన్ డైరెక్టర్ వివివినాయక్ డైరెక్షన్ లో చేసాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది.

మనం వంటి సినిమాతో అక్కినేని అభిమానులకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు విక్రమ్ కుమార్. ఆయన దర్శకత్వంలో ‘హలో’ అనే సినిమా చేసాడు అఖిల్. ఈ సినిమాకూడా అక్కినేని ఫ్యాన్స్ ను నిరాశపరిచింది. ఆతర్వాత వెంకీ అట్లూరి డైరెక్షన్ లో మిస్టర్ మజ్ను సినిమా చేసాడు. అయినా లాభంలేకుండా పోయింది. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటూ సిద్దమవుతున్నాడు ఈ కుర్రహీరో. అఖిల్ ఆశలన్నీ ఈ సినిమా పైనే పట్టుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన టీజర్ ,పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మరో పాటను విడుదల చేయనుంది చిత్రయూనిట్. సోమవారం సాయంత్రం 5 గంటలకు ఈ సినిమానుంచి జిందగీ అనే పాటను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ పై ఇంతవరకు క్లారిటీ రాలేదు. పోటీ లేకుండా సోలోగా రిలీజ్ చేసి హిట్ కొట్టాలని చూస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sundeep Kishan: నవ్వులతో రాబోతున్న ‘గల్లీ రౌడీ’.. సందీప్ కిషన్ సినిమా వచ్చేది అప్పుడే..

చిరంజీవి ఇచ్చిన స్ఫూర్తి వల్లే రాజకీయాల్లోకి వచ్చా..! అభిమానులు లేకపోతే పవన్‌ కల్యాణ్ లేడు.. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో వకీల్‌ సాబ్‌..

పవన్‌ కల్యాణ్ ఓ వ్యసనం.. అలవాటైతే చనిపోయే వరకు వదల్లేం.. వకీల్‌ సాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో బండ్ల గణేశ్‌ మాటలు..