AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhil Akkineni: లెనిన్ హిట్.. నాగార్జున కాళ్లు మొక్కి కన్నీళ్లు పెట్టుకున్న అక్కినేని అఖిల్

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లెనిన్ సినిమా ఈ రోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించింది.

Akhil Akkineni: లెనిన్ హిట్.. నాగార్జున కాళ్లు మొక్కి కన్నీళ్లు పెట్టుకున్న అక్కినేని అఖిల్
Akhil Akkineni
Rajeev Rayala
|

Updated on: Jul 10, 2026 | 6:08 PM

Share

అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఎట్టకేలకు హిట్ కొట్టాడు. లెనిన్ సినిమాతో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుంది. అఖిల్ మాస్ లుక్ లో నటించిన ఈ విలేజ్ డ్రామా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అఖిల్ కు హిట్ రావడంతో అక్కినేని అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. తాజాగా లెనిన్ సక్సెస్ ను అఖిల్ సెలబ్రేట్ చేసుకున్నారు. తండ్రి నాగార్జునతో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ లో కేక్ కట్ చేసిన అఖిల్.. ఎమోషనల్ అయ్యాడు. నాగార్జున కాళ్ళకు నమస్కరించి కన్నీళ్లు పెట్టుకున్నాడు. తండ్రిని కౌగిలించుకొని ఎమోషనల్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

Follow Us