మెగా మేనల్లుడు సాయి తేజ్ ప్రస్తుతం దేవా కట్టా దర్శకత్వంలో ఓ మూవీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో కథనాయికగా తొలుత నివేదా పేతురాజ్‌ని ఫైనల్ చేశారు. అయితే ఇప్పుడు ఆమె స్థానంలోకి ఐశ్వర్యా రాజేష్ వచ్చినట్లు తెలుస్తోంది. నివేదా పేతురాజ్ ఇతర చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల..కాల్షీట్లు అడ్జెస్ట్ చేయలేక ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో షూటింగ్ జరుపుకొంటోందీ చిత్రం.
ఈ చిత్రానికి ‘రిపబ్లిక్’ అనే పేరును ఖరారు చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. 2004లో ఏలూరులో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా, రాజకీయ నేపథ్యంలో ఆసక్తికర కథనంతో దేవ కట్టా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట . ఈ చిత్రంలో రమ్యకృష్ణ ముఖ్యమంత్రి పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇక హీరో సాయి తేజ్ డాక్టర్‌గా కనిపిస్తారట.
Also Read :
ఆవు పొట్టలో 80 కిలోల ప్లాస్టిక్..