Aishwarya Rai: ఐశ్వర్య రాయ్‌ను కూడా అలా అనేశారేంట్రా..! ప్రపంచ సుందరికి తప్పని బాడీ షేమింగ్

ఐశ్వర్య రాయ్ కర్ణాటకలోని మంగుళూరులో జన్మించింది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టడానికి ముంబైకి వెళ్లి అక్కడే స్థిరపడింది. 1994లో ఆమె మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకొని ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. 1997లో ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఇరువర్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ కు పరిచయమైంది. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి వరుస విజయాలను అందుకుంది.

Aishwarya Rai: ఐశ్వర్య రాయ్‌ను కూడా అలా అనేశారేంట్రా..! ప్రపంచ సుందరికి తప్పని బాడీ షేమింగ్
Aishwarya Rai

Updated on: Sep 30, 2026 | 12:20 PM

ప్రపంచ సుందరిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న అందాల తార ఐశ్వర్య రాయ్ బచ్చన్. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి అంతర్జాతీయ వేదికపై తన ప్రత్యేకతను చాటుకున్నారు. పారిస్ ఫ్యాషన్ వీక్‌లో జరిగిన ఓ ప్రతిష్టాత్మక ఫ్యాషన్ షోలో ర్యాంప్‌పై సందడి చేసిన ఆమె.. తన స్టైల్, గ్రేస్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. ర్యాంప్ వాక్ పూర్తయిన తర్వాత అభిమానులను ఉద్దేశించి ఆమె ఇచ్చిన ఫ్లయింగ్ కిస్, హార్ట్ సింబల్ కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఐశ్వర్య రాయ్‌కి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు ఆమె లుక్‌ను కాకుండా.. శరీరాకృతిపై పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయడం, బాడీ షేమింగ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

అలాంటి హీరోయిన్‌ మరొకరు ఉండరు.. అందం, గుణం కలబోసిన నటి.. ఆమె కోసమే ఆ సినిమాను 60, 70సార్లు చూశా

లోరియల్ పారిస్ నిర్వహించిన ‘ఎక్స్‌ప్రెస్ యువర్ వర్త్’ ఫ్యాషన్ షోలో ఐశ్వర్య రాయ్ బచ్చన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వయోలా డేవిస్, క్రిస్టెన్ బెల్, సిమోన్ ఆష్లే, ఈవా లాంగోరియా, కెండల్ జెన్నర్ తదితర అంతర్జాతీయ ప్రముఖులు కూడా సందడి చేశారు. కాగా ఐశ్వర్య ధరించిన లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్టైలిస్ట్ మోహిత్ రాయ్ ఆమె లుక్‌ను డిజైన్ చేశారు. ర్యాంప్‌పై నడుస్తూ ఐశ్వర్య ప్రదర్శించిన కాన్ఫిడెన్స్, ఎక్స్‌ప్రెషన్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ర్యాంప్ వాక్ తర్వాత ఐశ్వర్య చేసిన ఫ్లయింగ్ కిస్,  హార్ట్  సింబల్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

విరాట్ కోహ్లీ నా బావ.. షాకింగ్ విషయం చెప్పిన టాలీవుడ్ హీరోయిన్.. షాక్‌లో అభిమానులు

కాగా ఐశ్వర్య రాయ్ ఫ్యాషన్ షోకు సంబంధించిన పోస్టుల కింద కొంతమంది నెటిజన్లు ఆమె బాడీని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశారు. ఆమె బరువుపై పిచ్చిపిచ్చి కామెంట్స్, గతంలో లుక్ తో పోల్చుతూ విమర్శలు చేశారు. కొందరు ఆమె లుక్‌పై అసభ్యకరమైన కామెంట్స్ చ్చేస్తుండగా.. మరికొందరు ఆమె గర్భధారణకు సంబంధించిన ప్రశ్నలను కామెంట్స్ చేశారు. ఇంకొందరు ఆమె బరువు తగ్గాలని సూచిస్తూ కూడా కామెంట్లు పెట్టారు. ఒకవైపు ట్రోలింగ్ జరుగుతుండగా.. మరోవైపు ఐశ్వర్య రాయ్ అభిమానులు మాత్రం ఆమెకు గట్టిగా మద్దతు తెలిపారు. సోషల్ మీడియా పోస్టుల కింద ఆమెను ప్రశంసిస్తూ వేలాది కామెంట్లు కనిపించాయి. ఎప్పటికీ రాణే, క్వీన్ ఐశ్వర్య, మా రాణి ఎప్పుడూ గెలుస్తుంది అంటూ అభిమానులు ఐశ్వర్యపై తమ ప్రేమను వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

నువ్వేమైన పెద్ద హీరోయిన్‌వా.., అందగత్తెవా అంటూ అవమానించారు.. కట్ చేస్తే 150కుపైగా సినిమాలు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us