AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adivi Sesh: ఆ హీరో చాలా మంచోడబ్బా! రేలంగి మావయ్య లాంటోడు.. అడివి శేష్ కామెంట్స్ వైరల్

'డెకాయిట్' సినిమాతో మరో సాలిడ్ హిట్ అందుకున్నాడు టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్. దీని తర్వాత ఇప్పుడు గూఢచారి 2 సినిమా షూటింగ్ తో బిజీ బిజీగా ఉంటున్నాడీ క్రేజీ హీరో. అయితే తాజాగా ఓ స్టార్ హీరోను ఉద్దేశించి కార్తీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Adivi Sesh: ఆ హీరో చాలా మంచోడబ్బా! రేలంగి మావయ్య లాంటోడు.. అడివి శేష్ కామెంట్స్ వైరల్
Adivi Sesh
Basha Shek
|

Updated on: Sep 08, 2026 | 8:01 PM

Share

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగులో విభిన్నమైన కథలతో సినిమాలు తీసే హీరోల్లో శేష్ కూడా ఒకడు. క్షణం, గూడఛారి, ఎవరు, మేజర్ హిట్ 2, డెకాయిట్.. వంటి సినిమాలతో తెలుగులో క్రేజీ హీరోగా మారిపోయాడు శేష్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో గూఢచారి 2 సినిమాతో బిజీ బిజీగా ఉంటున్నాడు. 2018లో వచ్చిన ‘గూఢచారి’ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే చిత్రానికి సీక్వెల్ గా గూఢచారి 2 తెరకెక్కుతోంది. ప్రముఖ దర్శకుడు వినయ్ కుమార్ సిరిగినీడి భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు. ఇటీవల డీసీ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన వామికా గబ్బి ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. సుమారు రూ.100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హీరో అడివి శేష్ కూడా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా కార్తీ హీరోగా నటించిన సర్దార్ 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా హాజరయ్యాడు శేష్. ఈ సందర్భంగా హీరో కార్తీ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

‘ఈ ఈవెంట్ కు రావడం ఎంతో ప్రత్యేకంగా భావిస్తున్నాను. నాకు కార్తీ సార్ అంటే చాలా ఇష్టం. నా ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమాల్లో కార్తీ సార్ వే మూడు నాలుగు ఉన్నాయి. ‘ఆవారా’, ‘ఖైదీ’, ‘సత్యం సుందరం’.. ఈ సినిమాలతో పాటుగా ‘సర్దార్’ సినిమా అంటే కూడా చాలా ఇష్టం. మెసేజ్ ఇస్తూ రూపొందించిన స్పై సినిమాల్లో మాస్ మసాలా ఫన్ ఎంటర్టైనింగ్ ఫిలిం ‘సర్దార్ 1’. అందుకే నేను ఇప్పుడు ‘సర్దార్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చాను. నాకు తెలిసి ఈ సినిమా కుమ్మేస్తుంది. ‘సర్దార్ 1’కి నేను థియేటర్‌లో చాలా ఎంజాయ్ చేశాను. అరిచి గోల చేశాను. ఇప్పుడు సెప్టెంబర్ 10 కోసం ఎదురు చూస్తున్నాను. కార్తీ ఈ సినిమాని చెన్నైలో చూస్తే, ఆయన తరపున నేను హైదరాబాద్ లో చూస్తా. ఒకసారి మేజర్’ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు, నాకు హలో చెప్పడానికి ‘సర్దార్’ షూట్ నుంచి కార్తీ సార్ వచ్చారు. కార్తీ చాలా మంచి మనిషి అని, ఆయన ఎప్పుడు పిలిచినా వెళ్ళడానికి నేను రెడీగా ఉంటాను. కార్తీ సార్ ను చూస్తే రేలంగి మావయ్యని (‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మూవీలో ప్రకాష్ రాజ్ పాత్ర) చూసిన ఫీల్ వస్తుంది’ అని శేష్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us