Tamannaah: తమన్నా ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా.. మిల్కీబ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా ?..

|

Aug 10, 2022 | 5:38 PM

బ్రేక్ టైమ్‏లో ఏం చేస్తుందో తెలియజేస్తూ అందుకు సంబంధించిన వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేసింది.

Tamannaah: తమన్నా ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా.. మిల్కీబ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా ?..
Tamannah
Follow us on

ఇటీవల ఎఫ్ 3 సినిమాతో మరోసారి సూపర్ హిట్ అందుకుంది మిల్కీబ్యూటీ తమన్నా. ఇందులో తన నటనతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న భోళా శంకర్ చిత్రంలో నటిస్తుంది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే చిత్రీకరణలో దొరికిన విరామ సమయాన్ని తమన్నా సరికొత్తగా ఎంజాయ్ చేస్తుంది. బ్రేక్ టైమ్‏లో ఏం చేస్తుందో తెలియజేస్తూ అందుకు సంబంధించిన వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ఇంతకీ తమన్నా ఏం చేస్తుందో తెలుసుకుందామా.

షూటింగ్ బ్రేక్ టైంలో తాను కుండలు తయారు చేయడం నేర్చుకుంటున్నట్లు వీడియో పోస్ట్ చేసింది తమన్నా. మిస్ బితో కలిసి బ్రేక్ టైంలో కుండలు తయారు చేయడం నేర్చుకుంటున్నాను అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఎంతో అందంగా చిన్నపాటి కుండలు తయారు చేయడం చూడవచ్చు. దీంతో ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భోళా శంకర్ తోపాటు.. గుర్తుందా శీతాకాలం, చోర్ నికల్ కే భాగ, బాబ్లీ బౌన్సర్ చిత్రాలలో నటిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.